దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో సంచలనం సృష్టించారు. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలని అందుకున్న ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవల వివేక్ అగ్నిహోత్రి తన రాబోయే చిత్రం టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఇచ్చిన పజిల్ క్యూరియాసిటీని పెంచింది.ఇప్పుడు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ తను తీయబోయే చిత్రానికి ‘ది వాక్సిన్ వార్’ టైటిల్ ని ఖరారు చేశారు. ‘ది వాక్సిన్ వార్’ చిత్రం దేశంలో కోవిడ్ మహమ్మారి, టీకా కోసం జరిగిన కసరత్తులకు సంబధించిన అంశాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారని టైటిల్, పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. పోస్టర్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ను కలిగి ఉన్న వీల్‌ను చూడవచ్చు. అలాగే “మీకు తెలియని యుద్ధంలో మీరు పోరాడి గెలిచారు” అనే సందేశం కూడా కనిపోస్తోంది.
వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా వుంది.భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 11 భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ నిర్మాత పల్లవి జోషి మాట్లాడుతూ.. ఈ చిత్రం మన అద్భుతమైన బయో సైంటిస్టుల విజయాన్ని చాటుతోంది.వారి త్యాగం, అంకితభావం కృషికి నివాళిగా వుంటుంది’ అని అన్నారు.ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ‘ది వ్యాక్సిన్ వార్’ నిర్మిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా 11 భాషలలో ‘ది వాక్సిన్ వార్’ని విడుదల చేయనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.
మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…
మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…
పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…
సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…