విడుదలకు రెండు రోజుల ముందే మేము వేసిన “రిచిగాడి పెళ్లి”* ప్రీమియర్ షో కు మీడియా నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. దర్శక, నిర్మాత హేమరాజ్
కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై సత్య ఎస్ కె, ,నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, నటీనటులు గా కె ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా “రిచి గాడి పెళ్లి ”.ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ కు, టీజర్ కు, పాటలకు, ట్రైలర్ కు , ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ సినీ ప్రముఖులకు, పాత్రికేయులకు ప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది. షో అనంతరం
దర్శక, నిర్మాత హేమరాజ్ మాట్లాడుతూ.. మార్చి 3 న విడుదల అవుతున్న మా “రిచిగాడి పెళ్లి” సినిమాను ఈ రోజు పాత్రికేయమిత్రులకు ప్రీమియర్ షో వెయ్యడం జరిగింది. మీడియా వారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కొందరు సీనియర్స్ కూడామా సినిమా చూసి అప్రిసియేట్ చేశారు. ఒక ఫోన్ గేమ్ ఆధారంగా చేసుకొని తీసిన ఈ సినిమను ఊటీ లో షూట్ చెయ్యడం జరిగింది.ఈ సినిమాకు ఆర్థిస్టులందరూ వారికి వేరే షూట్స్ ఉన్నా వాటిని అడ్జస్ట్ చేసుకొని మా సినిమా కొరకు వర్క్ చేయడం జరిగింది. వారందరికీ నా ధన్యవాదాలు.మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
నటుడు సత్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీ లో నాకు అతి తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి నాకు మంచి ఫోన్ చేశారు. మార్చి 3 న విడుదల అవుతున్న మా “రిచిగాడి పెళ్లి” సినిమాను ఈ రోజు పాత్రికేయ మిత్రులకు, సినీ ప్రముఖులకు ప్రీమియర్ షో వెయ్యడం జరిగింది. మా ప్రీమియర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇంతమంచి సపోర్ట్ ఇస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
ఆర్టిస్ట్ కిషోర్ మారిశెట్టి మాట్లాడుతూ..దర్శకులు చెప్పినట్లు ఊటీలో చెయ్యడంతో సినిమా బాగా వచ్చింది. ఇందులోని సీన్స్ కూడా మీడియా మిత్రులు చూసి అప్రిసియేట్ చేశారు.ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే మీడియా వారికి ప్రీమియర్ వెయ్యడం జరిగిందంటే మా సినిమాపై మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మాకు తెలుసు. గతంలో కూడా నేను నటించిన రాణి సినిమాను ఆదరించారు. ఇప్పుడు మార్చి 3 న వస్తున్న ఈ సినిమాను కూడా ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నేను చాలా ప్రొడక్షన్స్ లో వర్క్ చేశాను. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.ఊటీ లో షూటింగ్ జరుగుతున్న టైం లో అక్కడ వర్షం పడినా కూడా మా అందరికీ చక్కటి హాస్పిటయాలిటీ కల్పించారు దర్శకులు హేమరాజ్ గారు. వారికి మా ఆర్టిస్టులందరి తరుపున థాంక్స్ చెపుతున్నాను. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఇంకా మరెన్నో సినిమాలు రావాలి. ఇలాంటి మంచి సినిమాలో నదర్శకులు హేమరాజ్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. డి. ఓ. పి గారు నన్ను చాలా బాగా చూయించారు. మార్చి 3 న వస్తున్న ఈ సినిమాను కూడా ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ప్రణీత పట్నాయక్ మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను చాలా సినిమాలు చేశాను.అయితే ఇప్పుడు చేసిన ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము చేసిన ఈ సినిమాను ఊటీ లో సింగిల్ షెడ్యూల్ లో షూట్ చేశాము.చాలా మంది ఆర్థిస్టులు పని చేసిన ఈ సినిమాకు మీడియా నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియాలో ఉన్న కీ రోల్ ఉన్న మంచి పాత్రలో నటించాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక , నిర్మాతలకు ధన్యవాదములు.. మార్చి 3 న వస్తున్న ఈ సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
కియారా నాయుడు మాట్లాడుతూ.. “రిచిగాడి పెళ్లి” అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నేను మంచి రోల్ చేయడం జరిగింది. ఇందులోని టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇందులో పని చేసిన టెక్నిషియన్స్ చాలా మంది ఆర్థిస్టులు గా వర్క్ చేయడంతో మాకు కరెక్షన్ చేసుకోవడం చాలా ఈజీ అయ్యింది.ఊటీ లో చేసిన ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో సింగిల్ టేక్ లో చేయడం జరిగింది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక , నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
నటి నటులు
సత్య ఎస్ కె, ,నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్,
ప్రవీణ్ రెడ్డి, బన్ని వాక్స్, సతీష్ శెట్టి, కియారా నాయుడు,
మాస్టర్ రాకేష్ తమోగ్న తదితరులు
సాంకేతిక నిపుణులు
సినిమా పేరు: రిచి గాడి పెళ్లి
బ్యానర్: కెఎస్ ఫిల్మ్ వర్క్స్
నిర్మాత: కేఎస్ హేమరాజ్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: KS హేమరాజ్
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్
సంగీతం: సత్యన్
ఎడిటర్: అరుణ్ EM
కథ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మదురి
సాహిత్యం: అనంత శ్రీరామ్ & శ్రీ మణి
పి ఆర్ ఓ : మధు వి ఆర్