విడుదలకు రెండు రోజుల ముందే “రిచిగాడి పెళ్లి”* ప్రీమియర్ షో

Must Read

విడుదలకు రెండు రోజుల ముందే మేము వేసిన “రిచిగాడి పెళ్లి”* ప్రీమియర్ షో కు మీడియా నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. దర్శక, నిర్మాత  హేమరాజ్

కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై సత్య ఎస్ కె, ,నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, నటీనటులు గా కె ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా “రిచి గాడి పెళ్లి ”.ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ కు, టీజర్ కు, పాటలకు, ట్రైలర్ కు , ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ సినీ  ప్రముఖులకు, పాత్రికేయులకు ప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది. షో అనంతరం

దర్శక, నిర్మాత హేమరాజ్ మాట్లాడుతూ..  మార్చి 3 న విడుదల అవుతున్న మా “రిచిగాడి పెళ్లి” సినిమాను ఈ రోజు పాత్రికేయమిత్రులకు ప్రీమియర్ షో  వెయ్యడం జరిగింది. మీడియా వారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కొందరు సీనియర్స్ కూడామా సినిమా చూసి అప్రిసియేట్ చేశారు. ఒక ఫోన్ గేమ్ ఆధారంగా చేసుకొని తీసిన ఈ సినిమను ఊటీ లో షూట్ చెయ్యడం జరిగింది.ఈ సినిమాకు ఆర్థిస్టులందరూ వారికి వేరే షూట్స్ ఉన్నా వాటిని అడ్జస్ట్ చేసుకొని మా సినిమా కొరకు వర్క్ చేయడం జరిగింది. వారందరికీ నా ధన్యవాదాలు.మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

నటుడు సత్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీ లో నాకు అతి తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి  నాకు మంచి ఫోన్ చేశారు. మార్చి 3 న విడుదల అవుతున్న మా “రిచిగాడి పెళ్లి” సినిమాను ఈ రోజు పాత్రికేయ మిత్రులకు, సినీ ప్రముఖులకు ప్రీమియర్ షో  వెయ్యడం జరిగింది. మా ప్రీమియర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇంతమంచి సపోర్ట్ ఇస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు  అన్నారు.

ఆర్టిస్ట్ కిషోర్ మారిశెట్టి మాట్లాడుతూ..దర్శకులు చెప్పినట్లు ఊటీలో చెయ్యడంతో సినిమా బాగా వచ్చింది. ఇందులోని సీన్స్ కూడా  మీడియా మిత్రులు చూసి అప్రిసియేట్ చేశారు.ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే మీడియా వారికి ప్రీమియర్ వెయ్యడం జరిగిందంటే మా సినిమాపై మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు. కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మాకు తెలుసు. గతంలో కూడా నేను నటించిన రాణి  సినిమాను ఆదరించారు. ఇప్పుడు మార్చి 3 న వస్తున్న ఈ సినిమాను కూడా ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నేను చాలా ప్రొడక్షన్స్ లో వర్క్ చేశాను. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.ఊటీ లో షూటింగ్ జరుగుతున్న టైం లో అక్కడ వర్షం పడినా కూడా మా అందరికీ చక్కటి హాస్పిటయాలిటీ కల్పించారు దర్శకులు హేమరాజ్ గారు. వారికి మా ఆర్టిస్టులందరి తరుపున థాంక్స్ చెపుతున్నాను. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఇంకా మరెన్నో సినిమాలు రావాలి. ఇలాంటి మంచి  సినిమాలో నదర్శకులు హేమరాజ్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. డి. ఓ. పి గారు నన్ను చాలా బాగా చూయించారు. మార్చి 3 న వస్తున్న ఈ సినిమాను కూడా ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ప్రణీత పట్నాయక్ మాట్లాడుతూ.. ఇంతకుముందు నేను చాలా సినిమాలు చేశాను.అయితే ఇప్పుడు చేసిన  ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము చేసిన ఈ సినిమాను ఊటీ లో సింగిల్ షెడ్యూల్ లో షూట్ చేశాము.చాలా మంది ఆర్థిస్టులు పని చేసిన ఈ సినిమాకు మీడియా నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియాలో ఉన్న కీ రోల్  ఉన్న మంచి పాత్రలో నటించాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక , నిర్మాతలకు ధన్యవాదములు.. మార్చి 3 న వస్తున్న ఈ సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

కియారా నాయుడు మాట్లాడుతూ.. “రిచిగాడి పెళ్లి” అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో  నేను మంచి రోల్ చేయడం జరిగింది. ఇందులోని టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇందులో పని చేసిన టెక్నిషియన్స్ చాలా మంది ఆర్థిస్టులు గా వర్క్ చేయడంతో మాకు కరెక్షన్ చేసుకోవడం చాలా ఈజీ అయ్యింది.ఊటీ లో చేసిన ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో సింగిల్ టేక్ లో చేయడం జరిగింది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక , నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

 నటి నటులు
సత్య ఎస్ కె, ,నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్,
ప్రవీణ్ రెడ్డి, బన్ని వాక్స్, సతీష్ శెట్టి, కియారా నాయుడు,
మాస్టర్ రాకేష్ తమోగ్న తదితరులు

 సాంకేతిక నిపుణులు
సినిమా పేరు: రిచి గాడి పెళ్లి
బ్యానర్: కెఎస్ ఫిల్మ్ వర్క్స్
నిర్మాత: కేఎస్ హేమరాజ్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: KS హేమరాజ్
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్
సంగీతం: సత్యన్
ఎడిటర్: అరుణ్ EM
కథ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మదురి
సాహిత్యం: అనంత శ్రీరామ్ & శ్రీ మణి

పి ఆర్ ఓ : మధు వి ఆర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News