కిరణ్‌ అబ్బవరం హీరోగా ‘మీటర్‌’ ఏప్రిల్‌ 7న విడుదల! 

Must Read

వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యంగ్‌ టాలెంటెడ్‌ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’. టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మై*త్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న వేసవిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ  సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ కిరణ్‌ అబ్బవరంతో నిర్మిస్తున్న పక్కా కమర్షియల్‌ సినిమా ఇది. ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరం పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఆయన లుక్‌, పాత్ర అన్ని కొత్తగా వుంటాయి. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్‌ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్‌, డీఓపీ: వెంకట్‌.సి.దిలీప్‌ అండ్‌ సురేష్‌ సారంగం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: జేవీ, సంభాషణలు: రమేష్‌ కాదూరి, సూర్య, లైన్‌ ప్రొడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబా సాయి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సురేష్‌ కందులు, మార్కెటింగ్‌: ఫస్ట్‌ఫో, పబ్లిసిటి:మ్యాక్స్‌ మీడియా, పీఆర్‌ఓ : వంశీ శేఖర్‌, మడూరి మధు, సమర్పణ: నవీన్‌ ఎర్నేనీ, రవి శంకర్‌ యలమంచిలి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమేష్‌ కాదూరి,

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News