తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

Must Read

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ, యువ నిర్మాత వంశీ నందిపాటి తన వంతు సహాయంగా కొంత మొత్తాన్ని విరాళంగా అందించారు.

సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం TFJA చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల పాత్ర సినీ పరిశ్రమలో ఎంతో ముఖ్యమని, వారి అభ్యున్నతికి అందరూ సహకరించాలని వంశీ నందిపాటి కోరారు.

ఈ సందర్భంగా TFJA సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అసోసియేషన్ తరఫున అభినందనలు తెలిపారు.

యువ నిర్మాతల నుంచి ఇలాంటి సహకారం రావడం అసోసియేషన్ కు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని వారు పేర్కొన్నారు.

Latest News

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ...

More News