తనికెళ్ల భరణి చేతుల మీదుగా ‘అసుర సంహారం’ మూవీ టీజర్ విడుదల

లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో, శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్స్, సాంగ్ లాంచింగ్ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది.

సుమారు 750కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన తనికెళ్ల భరణి, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన ‘విలేజ్ క్రైమ్ డ్రామా’గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో తనికెళ్ల భరణితో పాటు మిధున ప్రియ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “అసుర సంహారం అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ మంచి సబ్జెక్టను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాలో ఒక విలేజ్ లో డిటెక్టివ్ పాత్ర పోషింసించాను. ఈ సినిమా నిర్మించడంలో, షూటింగ్ పార్టులో NRI శబరిష్, మిధున ప్రియ మాకు బాగా సహకరించారు.” అని చెప్పారు.

దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ.. “తనికెళ్ల భరణి గారు ఇందులో ‘విలేజ్ డిటెక్టివ్‌’గా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మారుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా గారి సహాకారం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.

నటీ, excutive ప్రొడ్యూసర్ మిథున్ ప్రియా మాట్లాడుతూ… కొన్ని సినిమాల్లో చేసాను. ఇది నాకు పెద్ద సినిమా. నెల్లూరు చుట్టూ షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ప్రేక్షకుల సహకారం, ఆశీస్సులు కావాలి. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.” అని తెలిపారు.

TFJA

Recent Posts

10 నిమిషాల నుంచి 10 కోట్ల వరకు.. విష్ణు మంచు సాహసోతమైన నిర్ణయం

ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు విష్ణు మంచు సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్ ఈ మేరకు కొత్త…

7 hours ago

“చెన్నై లవ్ స్టోరీ” టీమ్, సమ్మర్ రిలీజ్ కు రాబోతున్న సినిమా

ప్రేక్షకులకు న్యూ ఇయర్ విశెస్ చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం, "కలర్ ఫొటో", "బేబి" మేకర్స్ కాంబో క్రేజీ మూవీ…

8 hours ago

సువర్ణ టెక్స్టైల్స్ ఫస్ట్ లుక్ విడుదల

శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ ప్రధాన పాత్ర దారులుగా ప్రశాంత్ నామిని రచన…

8 hours ago

The RajaSaab Trailer 2.0

https://www.youtube.com/watch?v=kioDUhqMEKU

22 hours ago

నూతన సంవత్సర శుభాకాంక్షలతో” ధర్మస్థల నియోజవర్గం” ఫస్ట్ లుక్ విడుదల

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్ ,సాయికుమార్ , నటరాజ్ వరుణ్ సందేశ్ ,వితికా షేరు, ప్రధాన…

22 hours ago

తెలుగులో యాక్షన్ థ్రిల్లర్ ‘ది టాస్క్’

డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కన్నడంలో రూపొందిన 'ది టాస్క్' చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే…

22 hours ago