• కాన్షియస్ ప్లానెట్ ఉద్యమం ద్వారా మానవ చైతన్యాన్ని పెంపొందించడంలోనూ, పర్యావరణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ సద్గురు చేసిన అసాధారణ కృషికి ఈ అవార్డు ప్రదానం చేయబడింది.
• సద్గురు అందుకున్న CAD 50,000 బహుమతిని కావేరి కాలింగ్ కార్యక్రమానికి అంకితం చేశారు, కావేరి నదిని పునరుజ్జీవింపజేసి 8.4 కోట్ల మంది ప్రజల జీవితాలను మార్చడం దీని లక్ష్యం.
ప్రఖ్యాత యోగి, మార్మికుడు మరియు ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు, కాన్షియస్ ప్లానెట్ ఉద్యమం ద్వారా మానవ చైతన్యాన్ని పెంపొందించడంలోనూ, పర్యావరణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలోనూ చేసిన అద్భుతమైన కృషికి కెనడా ఇండియా ఫౌండేషన్ (CIF) నుండి ‘గ్లోబల్ ఇండియన్ అవార్డు 2025’ ను అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపిన భారత సంతతికి చెందిన వ్యక్తులను ఈ ప్రతిష్టాత్మక గౌరవం గుర్తిస్తుంది.
మొదట అక్టోబర్ 2024లో ప్రకటించబడిన ఈ అవార్డు, 22 మే 2025న టొరంటోలో CIF చైర్ రితేష్ మాలిక్ మరియు నేషనల్ కన్వీనర్ సునీత వ్యాస్ చేతుల మీదుగా, భారత-కెనడియన్ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో అధికారికంగా ప్రదానం చేయబడింది.
అవార్డుతో పాటు, సద్గురుకు CAD 50,000 బహుమతి కూడా ప్రదానం చేయబడింది, దీనిని ఆయన కావేరి కాలింగ్‌కు అంకితం చేశారు – ఇది కావేరి నదిని పునరుజ్జీవింపజేసి, 8.4 కోట్ల మంది ప్రజల జీవితాలను మార్చే లక్ష్యంతో చేపట్టిన ఉద్యమం.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, CIF చైర్ రితేష్ మాలిక్ ఇలా అన్నారు: “మట్టి క్షీణత, వాతావరణ మార్పు మరియు ఆహార నాణ్యత వంటి ప్రపంచవ్యాప్త సవాళ్లకు సద్గురు ఆచరణాత్మక మరియు దీర్ఘకాలిక పరిష్కారాలను అందిస్తున్నారు. కెనడా దృష్టి సారిస్తున్న వ్యక్తిగత శ్రేయస్సు, సుస్థిరాభివృద్ధి మరియు సమైక్యత భావాలకు అనుగుణంగా మాట్లాడే సద్గురు వంటి అంతర్దృష్టి గల నాయకుల నుండి కెనడా ఎంతో ప్రయోజనం పొందవచ్చు. యోగా మరియు ధ్యానానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యం, ముఖ్యంగా మానసిక అనారోగ్యం వల్ల వ్యవస్థకు వచ్చే గొప్ప సవాళ్ల విషయంలో, కెనడా ప్రజారోగ్య ప్రాధాన్యాలతో సంపూర్ణంగా సరిపోతుంది.”
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో, CIF “భారత-కెనడియన్ కమ్యూనిటీ తరపున, కెనడా ఇండియా ఫౌండేషన్ అందించే ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ ను గత సాయంత్రం సద్గురు అంగీకరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. చైతన్యవంతమైన మరియు కరుణతో కూడిన మానవత్వమే ముందుకు వెళ్లే మార్గం అనే సద్గురు సందేశం లోతుగా ప్రతిధ్వనిస్తుంది” అని పంచుకుంది:
దీనికి స్పందిస్తూ, సద్గురు “భారతీయ కమ్యూనిటీ కెనడా మరియు భారతదేశం రెండింటి అభివృద్ధి మరియు శ్రేయస్సుకు సహకరిస్తుండడం చూడటం అద్భుతంగా ఉంది. మీ ఆత్మీయత & ఆతిథ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా ప్రేమ & ఆశీస్సులు” అని తెలిపారు.
కెనడా ఇండియా ఫౌండేషన్ అనేది కెనడా-భారతదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించే ఒక పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్. వారి గ్లోబల్ ఇండియన్ అవార్డ్, అద్భుతమైన విజయాలు సాధించి మానవాళికి గొప్ప సేవ చేస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులను గౌరవిస్తుంది.ఈ అవార్డ్ సద్గురు లాంటి ప్రపంచ స్థాయి మార్పుదారులను గుర్తిస్తుంది. సద్గురు చేపట్టిన కాన్షియస్ ప్లానెట్ ఉద్యమం- సేవ్ సాయిల్, కావేరి కాలింగ్, యాక్షన్ ఫర్ రూరల్ రిజువినేషన్ మరియు ఈశా విద్య లాంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ మరియు సామాజిక మార్పుకు దోహదం చేస్తోంది.