రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సుప్రియ యార్లగడ్డ ముఖ్య అతిథులుగా విచ్చేసారు.

ఈ సందర్బంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “మహేంద్రగిరి వారహి టీజర్ చాలా బాగుంది, పాజిటీవ్ ఫీలింగ్ కలిగింది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సూపర్ మ్యూజిక్ తో టీజర్ ఉంది, థియేటర్స్ లో ఈ సినిమా విజయం సాధిస్తుందని అనిపిస్తుంది, రంగమార్తాండ సినిమా తీసిన మంచి అభిరుచిగల నిర్మాత మధు గారు ఈ సినిమాను తీశారు అలాగే లక్ష్మణ్ గారు ఈ సినిమాకు మరో నిర్మాత ఆయనకు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, అనుప్ రూబెబ్స్ సూపర్బ్ రీ రికార్డింగ్ ఇచ్చారు, సంతోష్ జాగర్లపూడి విజన్ బాగుంది, ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన సుమంత్ గారు ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నను “ అన్నారు.
మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు కథ మురళి.
ఈ చిత్ర టీజర్ పై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది, మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది, రిచ్ విజువల్స్ మరియు ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉందని అంటున్నారు , టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఒక శాపం వెనుక ఉన్న రహస్యాన్ని, ఒక ఊరిలో జరుగుతున్న వరుస చావుల మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సుమంత్ రోల్ ఉండబోటింది . అసలు ఆ శాపం వెనుక కథ ఏంటి.. ? ఆ శాపం ఎప్పుడు పోతుంది.. ? సుమంత్ కి హెల్ప్ చేసే ఐశ్వర్య రాజేష్ ఎవరు.. ? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతోంది . విజువల్స్ చాలా గ్రాండ్‌గా, ముఖ్యంగా వారాహి అమ్మవారి ఉగ్రరూపం చూపించిన షాట్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.అనుప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వారాహి మంత్రం టీజర్‌ను సరికొత్త లెవెల్‌కు తీసుకెళ్లాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, నిర్మాతలు మధు, లక్ష్మణ్ సినిమాను అద్భుతంగా తెరాకెక్కించారు.
సుమంత్ కు తన కెరీర్ లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోయే సినిమాగా నిర్మాత కాలిపు మధు ఈ సినిమాను రూపొందించారు, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించారు.

