వెంకటలక్ష్మితో  యాడాది కిందట’ టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన శ్రీకాంత్

కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు : శ్రీకాంత్

టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌‌పై ఆలేటి రాజేష్ నిర్మాతగా రామమూర్తి  కొట్టాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రం ‘వెంకటలక్ష్మితో’. ‘యాడాది కిందట’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో  రఘు గద్వాల్ హీరోగా, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోయిన్స్‌గా నటించారు.  తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌‌ను హీరో శ్రీకాంత్ లాంచ్ చేసి సినిమా విజయం సాధించాలని కోరారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘టైటిల్ చాలా బాగుంది. క్యాచీగా ఉంది. యంగ్ టీమ్ చేసిన  సినిమా ఇది.  షార్ట్ ఫిలింస్ తో  ఫేమస్ అయిన హీరో రఘు  ఈ  సినిమా ద్వారా అందర్నీ ఆకట్టుకుంటాడని నమ్ముతున్నా. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇది కూడా ఓ కొత్త కంటెంట్‌తో రాబోతోందని అర్ధమవుతోంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.

చిత్ర  హీరో రఘు గద్వాల మాట్లాడుతూ.. ‘నూతన నటీనటులతో ఏడాది కిందట ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ గారు మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ గారికి మా టీమ్ తరపున స్పెషల్ థాంక్స్’ అని చెప్పారు.

 చిత్ర దర్శకుడు  రామమూర్తి కొట్టాల మాట్లాడుతూ.. ‘మా మూవీ టైటిల్ పోస్టర్‌‌ను శ్రీకాంత్ గారు లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇదొక స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం. థ్రిల్లర్, సస్పెన్స్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. అంతా కొత్త వారితో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తుంది. నిర్మాత రాజేష్ గారు బాగా సపోర్ట్ చేశారు. కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.

నిర్మాత ఆలేటి రాజేష్ మాట్లాడుతూ.. ‘సంవత్సరం కిందట ఈ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేశాం. దర్శకుడితో సహా అంతా కొత్త వారితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు’అని చెప్పారు.

చిత్రం :   వెంకటలక్ష్మితో .. యాడాది కిందట
బ్యానర్ :  టింట్ స్ప్రీ స్టూడియోస్
నిర్మాత: ఆలేటి రాజేష్
దర్శకత్వం : రామమూర్తి కొట్టాల BFA
హీరో: రఘు గద్వాల్
హీరోయిన్స్: ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న
సినిమాటోగ్రాఫర్ : రిషి, టి మహిధర్
మ్యూజిక్: సీఎన్ ఆదిత్య
ఎడిటర్: ప్రదీప్ కుమార్ రెడ్డి
కొరియోగ్రాఫర్ : వినయ్ మాస్టర్
పీఆర్‌ఓ : జీకే మీడియా

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

12 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago