సరిపోదా శనివారం’ని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ థాంక్ యూ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. 15 రోజులు గా టీంలో ఎవరికీ నిద్రలేదు. అప్పుడు పని చేసే ఒత్తిడితో నిద్ర లేదు. ఈ మూడు రోజులు గా సక్సెస్ ఎక్సయిట్మెంట్ తో నిద్రలేదు. రిలీజ్ రోజు నుంచి ఎన్నో అభినందనలు, ప్రసంశలు వస్తున్నాయి. సినిమాని మీరంతా ఆదరిస్తాని తెలుసు. థియేటర్ లో అందరితో కలసి ఆడియన్స్ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువగా అంచనా వేశామనిపించింది. సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారని మరోసారి ప్రూవ్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంత వర్షం లో కూడా అన్నీ చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయంటే వి హేవ్ గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ది వరల్డ్. ఆడియన్స్ అందరికీ థాంక్స్. మా టీం అందరి తరపున ఆడియన్స్ కి థాంక్స్ చెప్పడానికి కలిశాం. ‘సరిపోదా శనివారం’ నాట్ వీకెండ్ ఫిల్మ్.. ‘సరిపోదా శనివారం’ హియర్ ఫర్ లాంగ్ కాల్. లాంగ్ రన్ వుండబోతోంది. హెవీ రైన్స్ వుండి ఈ వీకెండ్ చూడలేకపోతే ఎలా ని భయపడకండి, సినిమా మీ చూట్టే వుంటుంది. మీ దగ్గరలోనే వుంటుంది, ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడండి.

చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది. సాయి కుమార్, శివాజీ రాజా గారు చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒక సోల్ యాడ్ చేశారు. బాయ్స్ కి ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది. ఎస్జే సూర్య గారి పెర్ఫర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరికి కంటే ముందు సెట్ లో ఆయన పెర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేశాను. ఆయనకి బిగ్ థాంక్స్, వివేక్ విషయంలో చాలా ప్రౌడ్ గా వుంది. అంటే సుందరానికీ రావాల్సిన బాక్సాఫీసు సక్సెస్ రాలేదనే చిన్న వెలితి వుండేది. అది కాస్త ‘సరిపోదా శనివారం’తో బ్యాలన్స్ అయిపొయింది. దానయ్య గారితో రెండో సినిమా ఇది. నిన్ను కోరి చాలా స్పెషల్ మూవీ. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’. నెక్స్ట్ టైం సినిమా చేసినప్పుడు అంచనాలు ఎక్కువగా వుంటాయి. అలాంటి సెటప్పే చేద్దాం. గట్టిగా కొడదాం. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ గురించి ఆడియన్స్ స్పెషల్ గా చెబుతున్నారు. డీవోపీ మురళి గా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎడిటర్ కార్తిక్ కి బిగ్ థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. సెప్టెంబర్ 5న ‘సరిపోదా శనివారం’ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ వుంటుంది. ‘సరిపోదా శనివారం’ ఈ శనివారంతో సరిపోదు నెక్స్ట్ శనివారం..నెక్స్ట్ శనివారం అలా వెళుతూనే వుంటుంది. మీ అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ తో వి హేవ్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బ్లస్టర్ ఇన్ అవర్ హాండ్స్. థాంక్ యూ ఆల్. ‘అన్నారు.

హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ.. ‘సరిపోదా శనివారం’కు ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్, సక్సెస్ చాలా థాంక్స్. చారు మీ మనసులో నిలిచిపోతుంది. ఇది నా ఫేవరేట్ క్యారెక్టర్. మీ లవ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే వుండాలి, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. 100 డేస్ సక్సెస్ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి. థాంక్ యూ సో మచ్’ అన్నారు.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. నామీద నాకున్న నమ్మకం కంటే నామీద నాని గారికి వున్న నమ్మకం ఎక్కువ. సగం గడ్డంతో ఇంట్రో సీన్ చేద్దామని చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా చేసేద్దామని అన్నారు. అంత ఫ్రీడమ్ దొరికింది కాబట్టే ఇలాంటి మంచి సినిమా రాగలిగింది. ఇప్పటివరకూ కొంచెం సాఫ్ట్ రోమ్ కాం సినిమాలే చేశాను. ఇలాంటి స్కేల్ వున్న సినిమాని హ్యాండిల్ చేయగలని నమ్మి బడ్జెట్ పెట్టిన నిర్మాత దానయ్య గారికి థాంక్ యూ. కళ్యాణ్ ఫస్ట్ సినిమాతోనే ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు ఆనందంగా వుంది. ప్రియాంక ఈ కథకు భెస్. చారులత క్యారెక్టర్ చాల ఎంజాయ్ చేస్తూ రాశాను. సాయి కుమార్ గారితో ప్రతి సీన్ లో ఎదో ఒక పని చేయిస్తూనే వున్నాను(నవ్వుతూ). శివాజీ రాజా గారు నా లక్కీ ఛార్మ్. ఎస్జే సూర్య గారి పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చాలా అనందాన్ని ఇచ్చింది. నేను రాసినదాని అంటే అద్భుతంగా చేశారు. మురళి శర్మగారితో పాటు అందరికీ పేరుపేరునా థాంక్స్. ఇది టీం ఎఫర్ట్. ఇంత అద్భుతమైన సక్సెస్ ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ’ అన్నారు.

నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, నాని గారి అభిమానులుకు పేరుపేరునా థాంక్స్ చెబుతున్నాను. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పాను. ఈ రోజు రిజల్ట్ కూడా అలానే వుంది. సినిమాని ఇంత బాగా తీసిన వివేక్ కి థాంక్ యూ. నిన్ను కోరి తర్వాత మళ్ళీ మాకు రెండో సక్సెస్ తీసుకొచ్చిన నాని గారికి థాంక్ యూ. ప్రియాంక మోహన్ గారు చాలా బాగా చేశారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ దడదడలాడించారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.

యాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ..ఈ శనివారం మా సూర్య చాలా కూల్ గా వున్నాడు. దీనికి కారణం మీరంతా ఇచ్చిన సక్సెస్. ఈ సందర్భంగా అందరికీ థాంక్ యూ. వివేక్ ఓ మంచి సినిమాని అందించాలని అహర్నిశలు కష్టపడ్డాడు. అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. చాలా ఆనందంగా వుంది. నానితో ఇది రెండో సినిమా. త్వరలో హ్యాట్రిక్ వుంటుంది. సూర్యని చూస్తే నా పోలీస్ స్టొరీ గుర్తుకువచ్చింది. మంచి టీంతో చేసిన వండర్ ఫుల్ సినిమా ఇది. నిర్మాత దానయ్య గారికి థాంక్ యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’ అన్నారు.

యాక్టర్ శివాజీ రాజా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. నా నలభై ఏళ్ల కెరీర్ లో సినిమా అంటే పిచ్చి వున్న వాళ్ళతో పని చేశాను. నాని గారు, వివేక్, దానయ్య గారు, సూర్య గారు అందరికీ సినిమా అంటే పిచ్చి. అందుకే సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. అందరికీ థాంక్ యూ’ అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago