దలపతి 67 లో సంజయ్ దత్, ప్రియా ఆనంద్

దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న ప్రాజెక్ట్  నిన్న అధికారికంగా అనౌన్స్ చేశారు. మాస్టర్, వారసుడు వంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్  పెట్టారు.

‘’మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, 2023న ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేరారు. ఈ చిత్రంలో భాగం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. “దలపతి67 వన్ లైనర్ విన్నప్పుడే ఈ చిత్రంలో భాగం అవుతానని తెలుసు.  ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా థ్రిల్‌గా వుంది’’ అన్నారు సంజయ్ దత్

ఈ సినిమాలో ప్రియా ఆనంద్ కూడా భాగం కానుంది. “దలపతి67లో భాగమైనందుకు థ్రిల్‌గా ఉంది. ఇటువంటి అద్భుతమైన తారాగణం, టీంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను! ” అన్నారు ప్రియా ఆనంద్.

కత్తి, మాస్టర్, బీస్ట్‌ చిత్రాలతోచార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్‌.. ‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు.

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్ గా,  ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.  ఎన్. సతీస్ కుమార  ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రామ్ కుమార్ బాలసుబ్రమణియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

తారాగణం: విజయ్, సంజయ్ దత్, ప్రియా ఆనంద్

టెక్నికల్ టీం :  
రచన, దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
బ్యానర్ : 7 స్క్రీన్ స్టూడియో
నిర్మాత : ఎస్ ఎస్ లలిత్ కుమార్
సహా నిర్మాత : జగదీష్ పళనిసామి సహ నిర్మాత
సంగీతం : అనిరుధ్ రవిచందర్‌
డిఓపి – మనోజ్ పరమహంస,
యాక్షన్ – అన్బరివ్,
ఎడిటింగ్ – ఫిలోమిన్ రాజ్,
ఆర్ట్ – ఎన్. సతీస్ కుమార్,
కొరియోగ్రఫీ – దినేష్,
డైలాగ్ రైటర్స్ – లోకేష్ కనగరాజ్, రత్న కుమార్ & దీరజ్ వైది,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రాంకుమార్ బాలసుబ్రమణియన్
పీఆర్వో : వంశీ శేఖర్

TFJA

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

21 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

21 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

21 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago