‘అమిగోస్’ చిత్రం నుంచి ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’కి రీమిక్స్  సాంగ్ రిలీజ్

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’.  రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ కానుంది. సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి.

మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ధ‌ర్మ క్షేత్రం సినిమాలో ఎవ‌ర్ గ్రీన్ మెలోడి సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ సాంగ్‌కి ఇది రీమిక్స్ సాంగ్‌. ధ‌ర్మ క్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. పాట‌ను  ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం పాడారు. యాదృచ్చికంగా ఇప్పుడు అదే పాట‌కు రీమిక్స్ సాంగ్‌ను కూడా ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్ ఆల‌పించారు. ఈ క్లాసిక్ సాంగ్‌ను ఎస్‌.పి.బి.చ‌ర‌ణ్‌తో పాటు స‌మీర భ‌ర‌ద్వాజ్ ఆల‌పించారు. ఇళ‌య రాజా అందించిన ఈ ట్రాన్సింగ్ ట్యూన్ మ‌న‌ల్ని మ‌రో ప్ర‌పంచ‌లోకి తీసుకెళుతుంది.

ఈ వీడియో సాంగ్‌ క‌ళ్యాణ్ రామ్‌, ఆషికా రంగ‌నాథ్ మ‌ధ్య సాగే బ్యూటీఫుల్ రొమాన్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేస్తుంది. చ‌క్క‌టి ట్యూన్‌కి త‌గ్గ సాహిత్యం,  విజువ‌ల్స్ ఆడియెన్స్ క‌ళ్ల‌కు ట్రీట్‌లాగా ఉంది. శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగ‌నాథ్ ఈ మెలోడి మ్యూజిక్‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తుంటే.. క‌ళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌తో ఆక‌ట్టుకున్నారు. బెస్ట్ సాంగ్స్ ప్లే లిస్ట్‌లో ఈ రీమిక్స్ సాంగ్ స్థానం ద‌క్కించుకుంటుంద‌న‌టంలో సందేహం లేదు.

జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

13 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

14 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

14 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago