ఆది అక్షర ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం రివెంజ్. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై చిత్రంపై అంచనాలను పెంచింది.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత బాబు పెదపూడి మాట్లాడుతూ..“మా ఫ్యామిలీ సపోర్ట్ తో అబ్రాడ్ వెళ్లాను. కానీ నాకు మొదటి నుంచి సినిమాలంటే ఎంతో ఇష్టం. అబ్రాడ్ లో ఉంటూనే త్రివిక్రమ్ గారి అతడు, దశరథ్ గారి శ్రీ సినిమాల్లో మంచి క్యారక్టర్స్ చేశాను. ఇంకా కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ నాకున్న బిజీ వల్ల చేయలేకపోయాను. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిత్రం దర్శకుడు శ్రీనివాస్ గారితో పరిచయం ఏర్పడింది. ఒక మంచి నటుడుగా నన్ను పరిచయం చేయడానికి నాకోసం చాలా పాత్రలు రాశారు. తన డెడికేషన్ నచ్చి ఈ సినిమా తనకిచ్చాను. అద్భుతంగా తీశారు. ట్రైలర్ చూశాక ఇది ఒక సైకో కథ అనిపించవచ్చు. కానీ బర్నింగ్ పాయింట్స్ తో తీసిన సినిమా ఇది. ప్రతి ఆడియన్ హర్ట్ ని టచ్ చేసే కథ. మనం అమితంగా ఇష్టపడే వాళ్లకు ఏమైనా జరిగితే మనం ఎలా మారిపోతాం అనేది సినిమా. ఆర్టిస్ట్స్ , టెక్నీషియన్స్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం“ అన్నారు.
చిత్ర దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ..“30 ఏళ్లుగా సినిమా రంగంలో ఉంటున్నా. విజయ్ భాస్కర్, వంశీ గార్ల వంటి ప్రముఖ దర్శకుల వద్ద పని చేశాను. పొదరిల్లు, ఐపిసి సెక్షన్ రెండు సినిమాలు డైరక్ట్ చేశాను. ఇది మూడో సినిమా. హీరో, నిర్మాత బాబుగారి ప్యాషన్ చూశాక ఒక మంచి కథ రాయాలని డిసైడ్ అయ్యాను. చాలా పాత్రలు రాశాను. చివరిగా రివెంజ్ కథ తీశాం. మొదట క్యారక్టర్ రాసి ఆ తర్వాత సినిమా కథ రాశాను. బాబుగారు ఎక్సెలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సెన్సార్ పూర్తయింది. జూలై 14న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
ఆరోహి, భార్గవ్, నాగేష్ కర్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డిఓపిః చిడతల నవీన్; సంగీతంః విజయ్ కురాకుల; పీఆర్వోః రమేష్ చందు; ఎడిటర్ః మేనగ శ్రీను; నిర్మాత: బాబురావు పెదపూడి(USA) రచన-దర్శకత్వంః రెట్టడి శ్రీనివాస్.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…