రెబల్ స్టార్ ప్రభాస్, హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ లో తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక ఒక పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇది నిమిషాల్లో వైరల్ గా మారింది.
“ఇండియన్ సినిమా…. మీ అజానుబాహుడును చూడండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 . #స్పిరిట్ ఫస్ట్ లుక్” అని సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు.
ఒళ్లంతా గాయాలతో, బ్యాండ్-ఎయిడ్‌లు కట్టుకుని ప్రభాస్ వెనక్కి తిరిగి నిలబడి వున్న రా అండ్ రస్టిక్ పోస్టర్ అదిరిపోయింది. పొడవాటి జుట్టు, గడ్డం పాత్ర ఇంటన్సిటీ ని మరింత పెంచుతోంది.
చేతిలో మద్యం సీసా పట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ని తెలియజేస్తోంది. అతని పక్కన ఉన్న త్రిప్తి డిమ్రీ ఒక ఎమోషనల్ మూమెంట్ లో అతని సిగరెట్‌ను వెలిగిస్తూ కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది.
ఈ ఫస్ట్ లుక్, ప్రభాస్ పోషిస్తున్న పాత్రను ఇంటన్సిటీ, పవర్ ని తెలియజేస్తోంది. హింస, అంతర్గత సంఘర్షణ చుట్టూ తిరిగే ఒక ఫెరోషియస్ కథను ప్రజెంట్ చేస్తోంది.
ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ ప్రారంభ దశలో ఉంది, ప్రభాస్ ఇప్పటికే తన ఎక్సయిట్మెంట్ ఎక్స్ ప్రెస్ చేయడంతో ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెరిగాయి.
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్ ,సాయికుమార్ , నటరాజ్ వరుణ్ సందేశ్ ,వితికా షేరు, ప్రధాన…
డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో కన్నడంలో రూపొందిన 'ది టాస్క్' చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే…
అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ క్రియేషన్స్ బ్యానర్ లో "సమ్మతమే" ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి…
స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద శరణ్య, సుదీక్ష సమర్ఫణలో కృతాక్షి నిర్మిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. శ్రీ స్కంద…
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ది పారడైజ్' ప్రతి అప్‌డేట్ ఈ సినిమా కోసం ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచుతుంది.…