హంట్ చిత్రం టైటిల్ మాది అంటున్న హీరో నిక్షిత్

శ్రీ క్రియేషన్స్ పతాకం పై నిక్షిత్ హీరోగా దర్శకుడిగా నర్సింగ్ రావు నిర్మాతగా నిర్మించబడుతున్న చిత్రం హంట్ (Hunt). ఈ చిత్రం యొక్క మోషన్ టీజర్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. అయితే హంట్ అనే పేరుతో హీరో సుధీర్ బాబు చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర వివరాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్ ఎస్ ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ, హీరో దర్శకుడు నిక్షిత్, డాన్స్ మాస్టర్ బషీర్ మరియు నిర్మాత నర్సింగ్ రావు పాల్గొన్నారు.ఎమ్ ఎస్ ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “మేము హంట్ చిత్రం మోషన్ టీజర్ ను విడుదల చేసాము. షూటింగ్ జరుగుతుంది. మేము హంట్ అనే టైటిల్ ను 6 నెలల క్రితం ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నాము. ఇప్పుడే అదే చిత్ర టైటిల్ తో భవ్య క్రియేషన్స్ వాళ్ళు సుధీర్ బాబు హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. వాళ్ళు ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ చిత్ర టైటిల్ శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై చాంబర్ లో రిజిస్టర్ అయింది.

మీరు ఎలా పెడతారు అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫిలిం ఛాంబర్ లో కూడా మా సమస్యని వెళ్లబుచ్చాము. చాంబర్ వాళ్ళు కూడా భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళ తో మాట్లాడారు కానీ మా సమస్యకు పరిష్కారం లభించలేదు అందుకే ఈ ప్రెస్ మీట్. ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ కి వచ్చినప్పుడు 21 రోజుల వ్యవధిలో వేరే చిత్రానికి ఈ టైటిల్ రిజిస్టర్ అయిందా అని చెక్ చేసి మరి టైటిల్ ని రిజిస్టర్ చేస్తారు. మరి మేము రిజిస్టర్ చేసుకున్న తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు ఎలా హంట్ చిత్ర టైటిల్ ని వాడతారు అని మేము ప్రశ్నిస్తున్నాము. మాకు న్యాయం కావాలి” అని కోరుకున్నారు.హీరో డైరెక్టర్ నిక్షిత్ మాట్లాడుతూ “ఒక సినిమా టైటిల్ ని రాయల్ గా దొంగిలించారు. రెండు మూడు నెలల నుంచి భవ్య క్రియేషన్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, హంట్ టైటిల్ మేము రిజిస్టర్ చేసుకున్నాము, మీరు టైటిల్ మార్చుకోండి అని. వాళ్ళు పటించుకోవడం లేదు. చాంబర్ లో కూడా కంప్లైంట్ చేసాం కానీ మాకు న్యాయం దొరకలేదు. మీడియా వల్లే నాకు న్యాయం కల్పించాలి” అని కోరుకున్నారు.

నిర్మాత నర్సింగ్ రావు “మేము మా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై హంట్ టైటిల్ ను రిజిస్టర్ చేసాం. షూటింగ్ కూడా జరుపుకుంటున్నాం. సడన్ గా ఒకరోజు హంట్ టైటిల్ తో సుధీర్ బాబు గారి పోస్టర్ కనిపించింది. వెంటనే భవ్య క్రియేషన్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారు కానీ వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. చాలా సార్లు మాట్లాడటానికి ప్రయత్నం చేసాము కానీ ఫలితం లేదు. చాంబర్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసారు కానీ ఫలితం లేదు. మా చిత్ర ఆడియో రైట్ అమ్మటానికి ప్రయత్నం చేసాం కానీ హంట్ పేరు తో వేరే చిత్రం ఉంది మేము మీ చిత్రం కొనలేము అని తెలిపారు. మా న్యాయం కావాలి” అని తెలిపారు

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

23 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

23 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

23 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago