నవంబర్ 11 సమంత ‘యశోద’ విడుదల

పాన్ ఇండియా స్టార్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి మరియు హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నేడు వెల్లడించారు. కథ, కథనం, నిర్మాణ విలువల్లోనే కాక చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా రొటీన్ కి భిన్నంగా వెళుతున్న చిత్ర టీం, విడుదల తేదీ పోస్టర్ ని వినూత్నంగా అభిమానులు ద్వారా విడుదల చేసారు.

చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు. కానీ, ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. వినూత్నమైన కథతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ‘యశోద’. టైటిల్ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకుని, చాలా ఎఫర్ట్స్ పెట్టి క్యారెక్టర్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు. మణిశర్మ నేపథ్య సంగీతం కొత్త డైమెన్షన్‌లో ఉంటుంది. ఈ వారంలో సెన్సార్ పూర్తవుతుంది. సాంకేతికంగా ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. కొత్త కంటెంట్ కావాలని కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం ‘యశోద’లో ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నవంబర్ 11, 2022న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తాం” అని చెప్పారు. 

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్,  ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి మరియు హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

Tfja Team

Recent Posts

ప్రకాష్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’.. సెప్టెంబర్ 4గా స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

భారతదేశంలో ప్రత్యేకమైన ఒరిజినల్స్ అందించే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో తాజాగా తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్…

24 minutes ago

అనుకున్న సమయానికి, తక్కువ బడ్జెట్‌లో సినిమా ప్రాజెక్ట్‌ పూర్తి కావాలా?.. ఆల్‌ ఇన్‌ వన్‌ సాఫ్ట్‌వేర్ ‘సినరీ’ ఉందిగా!

సినిమా, షార్ట్‌ ఫిల్మ్‌, వెబ్‌ సిరీస్‌ వంటి ప్రాజెక్టులను రూపొందించే ప్రతి నిర్మాత, దర్శకుడు, మూవీ ప్రొఫెషనల్‌కు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌…

2 hours ago

‘ఇరుముడి’ కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ గారి సినిమాల్లో నా ఫేవరెట్ ఇరుముడి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో,…

18 hours ago

అభిమానం ముందు అనారోగ్యం కూడా ఓడిపోవాలి… శశి కోసం రామ్ పోతినేని చేసిన మానవీయ ప్రయత్నం

రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి. కానీ…

19 hours ago

తెలంగాణ నుండి 9,600 మందికి పైగా గ్రామీణ క్రీడాకారులను ఒకే తాటిపైకి తెచ్చిన ఈశా గ్రామోత్సవం; ఎల్బీ స్టేడియంలో స్టేట్ ఫైనల్ నిర్వహణ

ఆగస్టు 16, హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడోత్సవం అయిన ఈశా గ్రామోత్సవం 2026 - తెలంగాణ ఎడిషన్లో రాష్ట్రవ్యాప్తంగా…

2 days ago

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం.

వీటి ఎంటర్ ప్రైజెస్ పతాకం పై హరిహరన్, శ్రీలేఖ, సుహానా హరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న" దొరికిందా" చిత్రం నేడు హైదరాబాద్…

2 days ago