‘మజాకా’ క్రూషియల్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం

Must Read

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తాసహ నిర్మాత. ఈ మాస్ ఎక్స్‌ప్లోజివ్ ఎంటర్‌టైనర్ న్యూ షూటింగ్ షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభమైంది.

20 రోజుల లెన్తీ షెడ్యూల్‌లో, సందీప్ కిషన్, ఇతర ముఖ్యమైన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నందున ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

సంక్రాంతి బుల్లోడు అవతార్‌లో సందీప్‌కిషన్‌ను ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ప్రామిస్ చేసింది. ఈ మూవీలో రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  

రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు త్రినాధరావు నక్కినతో సక్సెస్ ఫుల్ అసోషియేషన్ ని కొనసాగిస్తూ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. త్రినాథరావు నక్కిన, ప్రసన్న మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుంది.

ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: త్రినాధరావు నక్కిన
బ్యానర్లు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్
నిర్మాత: రాజేష్ దండా
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సహ నిర్మాత: బాలాజీ గుత్తా
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి
సంగీతం: లియోన్ జేమ్స్
డీవోపీ: నిజార్ షఫీ
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Latest News

Actor Yogesh Kalle in the Pan India Film Trimukha

Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in which nassar, CID Aditya...

More News