మల్టీ లేయర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త సైఫై థ్రిల్లర్ గా ప్రతి ప్రేక్షకుడినీ “కిల్లర్” సినిమా ఆకట్టుకుంటుంది – టీజర్ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ సుకు పూర్వాజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్”. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

లైన్ ప్రొడ్యూసర్ సీతారామరావు మాట్లాడుతూ– “కిల్లర్” చిత్రం కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. టీజర్ లాగే సినిమాకు కూడా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

లైన్ ప్రొడ్యూసర్ దశరథ మాధవ్ మాట్లాడుతూ – మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో ఆకట్టుకునేలా మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో నేను బ్రదర్ రోల్ లో నటించాను. చిన్న సినిమా అయినా “కిల్లర్” పెద్ద విజయం సాధిస్తుంది. అన్నారు.

యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ – ఈ చిత్రంలో నేను విలన్ క్యారెక్టర్ లో నటించాను. నన్ను ఒక పవర్ ఫుల్ విలన్ గా చూపించిన డైరెక్టర్ సుకు పూర్వాజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు మేమంతా టీమ్ వర్క్ చేశాం. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. అన్నారు.

యాక్టర్ గౌతమ్ చక్రధర్ మాట్లాడుతూ – “కిల్లర్” సినిమాలో జ్యోతి పూర్వజ్ గారి యాక్షన్, ఆమె ట్రాన్సఫర్మేషన్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. నేను కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్సులు పర్ ఫార్మ్ చేశాను. ఈ సినిమా టెక్నికల్ గా మంచి క్వాలిటీతో మా డైరెక్టర్ రూపొందించారు. ఇది టీజర్ మాత్రమే సినిమాతో పెద్ద సక్సెస్ అందుకుంటామనే నమ్మకం ఉంది.అన్నారు.

యాక్టర్ విశాల్ రాజ్ మాట్లాడుతూ – మా సినిమా టీజర్ చూస్తేనే టెక్నికల్ గా మూవీ ఎంత క్వాలిటీగా ఉండబోతుందో మీ అందరికీ అర్థమై ఉంటుంది. జ్యోతి గారిని మనం సీరియల్స్ లో చూశాం. ఇప్పుడీ మూవీలో ఆమె పర్ ఫార్మ్ చేసిన విధానం సర్ ప్రైజ్ చేస్తోంది. డైరెక్టర్ పూర్వాజ్ నాకు మంచి ఫ్రెండ్. ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేసే అవకాశం కల్పించారు. ఈ సినిమా మా టీమ్ అందరికీ మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

యాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ – జ్యోతి పూర్వజ్ గారిని కొత్తగా ఈ చిత్రంలో స్క్రీన్ మీద చూడబోతున్నాం. టెక్నికల్ వండర్ గా ఈ సినిమా ఉంటుంది. తెలుగు నుంచి వస్తున్న అరుదైన సినిమాల్లో ఒకటిగా కిల్లర్ పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

యాక్టర్ చందు మాట్లాడుతూ – కిల్లర్ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న సుకు గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటనేది సస్పెన్స్. అందుకే టీజర్ లో కూడా రివీల్ చేయలేదు. కథలో ఆద్యంతం నా క్యారెక్టర్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఈ చిత్రంతో నాకు నటుడిగా మంచి గుర్తింపు వస్తుంది. అన్నారు.

యాక్టర్ కాళీచరణ్ మాట్లాడుతూ – మా సినిమా టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. నేను నటించిన ఓం బీమ్ భుష్ చిత్రంలాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి. జ్యోతి గారు యంగ్ ఐశ్వర్య రాయ్ లా కనిపిస్తున్నారు. ఇలాంటి హై క్వాలిటీ మూవీని థియేటర్స్ లోనే మీరంతా చూడాలి. అన్నారు.

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ – నేను సీరియల్స్ లో రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయి ఉన్న టైమ్ లో డైరెక్టర్ సుకు పూర్వజ్ నన్ను స్క్రీన్ మీద కొత్తగా చూపించేందుకు ముందుకొచ్చారు. నేను ఆరేడు క్యారెక్టర్స్ ఉన్న ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదు. ఎవరైనా డ్యూయల్ రోల్ చేస్తారు కానీ ఆరేడు క్యారెక్టర్స్ లో పర్ ఫార్మ్ చేసే అవకాశం రావడం ఏ యాక్టర్ కైనా డ్రీమ్ అనుకోవచ్చు. ఈ సినిమాలో నాతో యాక్షన్ కూడా చేయించాడు డైరెక్టర్. విజయశాంతి గారిలా యాక్షన్ చేయాలని నాకూ డ్రీమ్ ఉండేది. అలాంటి అవకాశం “కిల్లర్” చిత్రంతో దక్కింది. పూర్వజ్ ఇచ్చిన సపోర్ట్ తోనే నేను ఈ సినిమా చేయగలిగాను. ఈ మూవీ కోసం డైరెక్టర్ పూర్వజ్ చాలా కష్టపడ్డాడు. పెళ్లయ్యాక చాలా మంది పర్సనల్ వెకేషన్ కు వెళ్తారు. కానీ మనం సినిమా చేద్దామని పూర్వాజ్ నాతో అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా రూపొందించడం ద్వారా చాలా మందికి ఎంతో కొంత ఉపాధి కల్పించినవారం అవుతాం అనుకున్నాను. జ్యోతి అంటే మంచి పర్ ఫార్మర్ అని, పూర్వాజ్ అంటే మంచి డైరెక్టర్ టెక్నీషియన్ అని ఈ చిత్రంతో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. పూర్వాజ్ లో అమేజింగ్ యాక్టర్ ఉన్నాడు. రీసెంట్ గా అనిల్ రావిపూడి గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేసి పూర్వాజ్ లో మంచి యాక్టర్ ఉన్నాడని చెప్పారు. మాకున్న లిమిటేషన్స్ దాటి ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంతో డబ్బులు చేసుకుందామని కాదు మేకర్స్ గా ఒక ఫౌండేషన్ వేసుకోవాలనే ప్రయత్నిస్తున్నాం. మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

డైరెక్టర్ సుకు పూర్వాజ్ మాట్లాడుతూ – ఐదారేళ్ల కిందట అనుకున్న స్క్రిప్ట్ ఇది. మేము గతంలో గ్లింప్స్ ద్వారా చూపించింది చాలా తక్కువ అని చెప్పాను. ఇప్పుడు టీజర్ లో చాలా జాగ్రత్తగా కట్ చేసి మేము చూపించిన కంటెంట్ 40 పర్సెంట్ మాత్రమే. త్వరలో రాబోయే ట్రైలర్ లో 80 పర్సెంట్ చూపిస్తాం. థియేటర్ లో హండ్రెడ్ పర్సెంట్ సినిమా కథేంటి అనేది తెలుస్తుంది. మేము టీజర్ లో చెప్పినట్లు మీ మేధస్సును ఉపయోగించండి అనేది ఎందుకు చెప్పామో మూవీ చూస్తే తెలుస్తుంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ డ్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, రివేంజ్, సబ్ కాన్షియస్ ఐడెంటిటీ.. ఇలాంటి ఎలిమెంట్స్ తో సైఫై థ్రిల్లర్ గా కిల్లర్ సినిమాను రూపొందించాం. మల్టీలేయర్ స్క్రీన్ ప్లే ఉన్నా ప్రతి సెక్షన్ ఆడియెన్ కు మూవీ ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. వుమెన్ సెంట్రిక్ చిత్రమిది. కిల్లర్ లో ఆర్ అక్షరం రక్తిక అనే వ్యాంపైర్, రనియా అనే టెర్రరిస్ట్, రియా అనే స్పై, రై అనే విషపూరిత వుమెన్..ఈ క్యారెక్టర్స్ తో పాటు మేము రివీల్ చేయని మరో క్యారెక్టర్ ఉంటుంది. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. అది ఇంకా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. మా టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి మా అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ , మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్

రచన, ఎడిటింగ్, దర్శకత్వం – పూర్వాజ్
సమర్పణ – ఉర్వీశ్ పూర్వజ్
ప్రొడ్యూసర్స్ – పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ – జగదీశ్ బొమ్మిశెట్టి
స్క్రీన్ ప్లే ఎడిటర్ – పూర్వాజ్
మ్యూజిక్ – ఆశీర్వాద్, సుమన్ జీవ
చీఫ్ ఎడిటర్ – బి.మనోజ్ కుమార్
మాస్టర్ చీఫ్ ఎడిటర్ – శివ శర్వాణి
కాస్టూమ్ డిజైన్ – ఉదయశ్రీ పూర్వజ్
ఆర్ట్ డైరెక్షన్ – మణి
యాక్షన్ కొరియోగ్రఫీ – రాజ్ కుమార్ గంగపుత్ర
లైన్ ప్రొడ్యూసర్స్ – దశరథ మాధవ్, సీతారామారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డీఎస్ బాష
డీఐ – మయసభ స్టూడియోస్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

TFJA

Recent Posts

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’.. మే15న గ్రాండ్ రిలీజ్‌

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య…

3 hours ago

‘హే బల్‌వంత్‌’ లో హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లు ఊగిపోతున్నాయి: కమెడియన్‌ సుదర్శన్‌

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

5 hours ago

‘GS (గాడ్స్ అండ్ సోల్జర్స్)’ షూటింగ్ పూర్తి – శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్‌

రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ ప్రధాన చిత్రీకరణ పూర్తైంది.…

1 day ago

ఈ సమ్మర్ లో రెండు ప్రెస్టీజియస్ మూవీస్ “స్వయంభు”, “నాగబంధం”తో ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరోయిన్ నభా నటేష్

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ కు ఈ సమ్మర్ ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు…

1 day ago

ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

1 day ago

హేబల్‌వంత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లు ఊగిపోతున్నాయి: సక్సెస్‌మీట్‌లో చిత్ర యూనిట్‌

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌…

2 days ago