మిస్టర్ ఇడియ‌ట్‌ లోని ‘కాంతార కాంతార’ లిరికల్ సాంగ్ రిలీజ్

మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా “మిస్టర్ ఇడియ‌ట్‌”. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన “మిస్టర్ ఇడియ‌ట్‌” ట్రైలర్ డిజిటల్ వ్యూస్ లో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ రోజు “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమా నుంచి ‘కాంతార కాంతార..’ లిరికల్ సాంగ్ ను యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. పాట చాలా ఎనర్జిటిక్ గా ఉందన్న ఆయన మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలియజేశారు.

అనూప్ రూబెన్స్ మంచి బీట్ తో కంపోజ్ చేసిన ‘కాంతార కాంతార..’ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్ పాటలోని ఎనర్జీని రెట్టింపు చేసేలా పాడారు. ‘ఎందుకె చిట్టి నువ్వు ఇట్లా పుట్టినావు మందిని సంపుతావు ఏందే, మా లెక్కనే నీకు రెండు కాళ్లు చేతులు ముక్కు మూతి ఉన్నయి గాదె, బలుపు నీకు ట్విన్ బ్రదరా, ఈగో నెత్తి మీద ఫెదరా, మనషులంటే నీకు పడరా, నువ్వేమన్న అవతారా, ఎమి చూసుకుని నీకు ఇంత టెక్కూ, దిష్టి బొమ్మకైన పనికి రాదు నీ పిక్కూ ..కాంతార కాంతార కాంతారా…’ అంటూ సాగుతుందీ పాట. కాలేజ్ లో హీరోయిన్ ను హీరో టీజింగ్ చేసే సందర్భంలో ఈ పాటను రూపొందించారు.

నటీనటులు – మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ‌, తదితరులు

టెక్నికల్ టీమ్

డైలాగ్స్ – శ్యామ్, వంశీ
సంగీతం అనూప్ రూబెన్స్
లిరిక్స్ – శివశక్తి దత్తా, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్
కొరియోగ్రఫీ – భాను, జిత్తు, వెంకట్, పృథ్వీ
స్టంట్స్ – రాజేశ్ లంక
సినిమాటోగ్రఫీ – రామ్ రెడ్డి
ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్ – విప్లవ్ నైషధం
పీఆర్వో – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – జేజేఆర్ రవిచంద్
రచన, దర్శకత్వం – గౌరి రోణంకి

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

20 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

20 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

20 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago