‘శ్వాగ్’కు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.

శ్రీవిష్ణు గారి క్యారెక్టర్స్, గెటప్స్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన అప్లాజ్ వస్తోంది. సినిమా ఎక్స్ ట్రార్డినరీగా ఆడుతోంది: నిర్మాత టీజీ విశ్వప్రసాద్

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో పోషించారు. శుక్రవారం (అక్టోబర్ 4) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, విమర్శకులు ప్రశంసలు అందుకొని కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ…’శ్వాగ్’కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన అప్రిషియేషన్ వస్తోంది. కథ, పెర్ఫార్మెన్స్, కొత్త కంటెంట్ ను ప్రేక్షకులు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్ ఎప్పుడు చేసిన ఆదరిస్తారనే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది. అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. నా క్యారెక్టర్స్, గెటప్స్ కి ఆడియన్స్ నుంచి చాలా మంచి అప్లాజ్ రావడం ఆనందంగా వుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మార్నింగ్ నుంచి ఇండస్ట్రీ, మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచి వచ్చినన్ని కాల్స్ మరే సినిమాకి రాలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి, డైరెక్టర్ హసిత్, టీం అందరికీ చాలా థాంక్స్. సినిమా తప్పకుండా చూడండి, ఎప్పుడూ చూడని కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్ యూ’అన్నారు

డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. సినిమాలో కొత్త విషయాలని హత్తుకునేలా చెప్పాం. ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్వాగ్ పెద్ద జర్నీ. బిగినింగ్ నుంచి ఎడింగ్ వరకూ మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. ఇలాంటి కథని హీరో నమ్మి చేయకపోతే అది ముందుకు వెళ్ళదు. శ్రీ విష్ణుగారి పెర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. పర్శనల్ గా నా సైడ్ నుంచి శ్రీవిష్ణు గారికి కృతజ్ఞతలు. మీడియా సినిమాని ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇదే సపోర్ట్ ఇస్తారాని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ.. ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియన్స్ తో కలసి చూశాం. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బావుంది. నాకు స్టొరీ తెలిసినప్పటికీ థియేటర్ లో మూవీ చూసినప్పుడు చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా నచ్చింది. సినిమాలో చాలా అద్భుతమైన ఎమోషన్ వుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన అందరికీ థాంక్ యూ. తప్పకుండా సినిమా చూడండి మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

దక్ష నాగర్కర్ మాట్లాడుతూ.. మా సినిమా గురించి అందరూ చాలా అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు. పెర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నారు

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్ యూ. నేను ముందుకు చెప్పినట్లు పీపుల్ మీడియాలో చాలా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాను, శ్వాగ్ కూడా కమర్షియల్ ఫిల్మే, కంటెంట్ పరంగా లాంగ్ పిరియడ్ గుర్తుండిపోయే సినిమా అని నమ్మే తీశాం. మేము అనుకున్నట్లు సినిమా వచ్చింది. శ్రీవిష్ణు గారికి క్యారెక్టర్స్, గెటప్స్ కి చాలా అద్భుతమైన అప్లాజ్ వస్తోంది. మార్నింగ్ ’35 చిన్న కథ కాదు’ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందని అన్నారు. ఎందుకంటే.. 35 సినిమాకి నేషనల్ అవార్డ్ వస్తుందని అనుకున్నాం ఇప్పుడు మీరు కొట్టేస్తున్నారని అభినందించారు. మార్నింగ్ నుంచి అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇన్ని క్యారెక్టర్స్ తో ఇంత పెద్ద కథ చెప్పడం ఛాలెంజ్. ఫస్ట్ హాఫ్ వెరీ ఫేసీ అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇంటర్వెల్ కి అంతా క్లియర్ అయి త్రూ అవుట్ సినిమాని ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. సినిమా ఎక్స్ ట్రార్డినరీగా ఆడుతోంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ’ అన్నారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago