జవాన్’ సినిమా మహిళల గొప్పతనాన్నిపురుషులకు తెలియజేసేలా తెరకెక్కిన సినిమా – #AskSRKలో షారూఖ్ ఖాన్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’పై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. అభిమానులు, ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన #AskSRK అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో ముచ్చటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా #AskSRKలో జవాన్ గురించి నెటిజన్స్ షారూఖ్‌ను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేయగానే ఆయన కూడా సమాధానాలు ఇచ్చారు. ఆ విశేషాలేంటో చూద్దాం…
* ‘జవాన్’లో షారూఖ్ పాత్రను ఓ పదంలో చెప్పండి
– మహిళలు.. ‘జవాన్’ సినిమాను మహిళలే నడిపిస్తారు. ఇది మహిళల గొప్పతనాన్ని పురుషులకు తెలియజేసేలా తెరకెక్కిన సినిమా. మాస్, క్లాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది.
* మోషన్ పోస్టర్ మీద ఓ పద్యం చెప్పండి..
– మీరు అందరూ మోషన్ పోస్టర్ మీద ఒక్కొక్కరు ఓ పద్యాన్ని రాసి నాకు పంపండి.. ఎవరూ బాగా రాశారో చూద్దాం.
*న్యాయానికి గల 5 ముఖాలేంటి?
– ఈ సినిమాలో అలాంటివి చాలా ముఖాలే ఉంటాయి. రేపు థియేటర్‌లో ఆవేంటో స్క్రీన్ పై చూస్తారు.
*జవాన్ మూవీలో గుండుతో కనిపించడం ….
– జవాన్ సినిమాలో నేను గుండుతో కనిపించటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పఠాన్ సినిమాలో పొడవాటి జుట్టుతో నటించాను. ఆ వెంటనే చేసిన జవాన్ మూవీలో గుండు లుక్‌తో నటించాను. ఇది నా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఎదురు చూస్తున్నాను..హ హ
* జవాన్ సినిమాను ఎన్ని సార్లు చూడొచ్చు
– ఓ సారి మనసు కోసం, ఓసారి తనువు కోసం, ఓ సారి ఫన్ కోసం, నా అభిమాని అయితే నా కోసం ఓసారి.. నాలుగు సార్లు చూడండి
* జవాన్‌ను ఎవరెవరు చూడొచ్చు
– పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ చూడొచ్చు
* జవాన్‌లో బెస్ట్ షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్
– జవాన్‌లో చాలా లుక్స్, చాలా షేడ్స్ చేశాను. చాలా కష్టపడ్డాం. అయితే సినిమాను ఫైనల్‌గా చూసిన తర్వాత అందరూ ఎంజాయ్ చేశారు.
*జవాన్ ప్రివ్యూ 2 ఉంటుందా!
– ప్రివ్యూ మళ్లీ రీ లోడ్ చేయించాలా లేక పాటను రిలీజ్ చేస్తున్నాం.. దాన్ని రిలీజ్ చేయాలా!. మీరందరూ ఆలోచించి చెప్పండి. డైరెక్టర్ అట్లీతో మాట్లాడి చెబుదాం. ఏదైనా తను చేయాల్సిందే.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…