‘పరదా’ నుంచి ‘అమిష్ట’ గా దర్శన రాజేంద్రన్ పరిచయం 

Must Read

“సినిమా బండి”సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రం ‘పరదా’తో మరో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెరీ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్, వెర్సటైల్ దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. 

శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మాతలుగా ఆనంద మీడియా తన తొలి ప్రొడక్షన్ తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  

‘హృదయం’, ‘జయ జయ జయ జయ హే’ చిత్రాలతో పాపులరైన సూపర్ ట్యాలెంటెడ్ దర్శన రాజేంద్రన్ పరదా చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. దర్శన రాజేంద్రన్ బర్త్ డే సందర్భంగా విషెష్ అందించిన మేకర్స్ ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ‘అమిష్ట’ గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. దర్శన ను సివిల్ ఇంజనీర్ ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది.  

మేకర్స్ షేర్ చేసిన స్పెషల్ వీడియోలో దర్శన రాజేంద్రన్ ను ‘అమిష్ట’ క్యారెక్టర్ లో చాలా బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేశారు. వీడియో చివర్లో ‘అబ్బాయిలు చేయలేనిది, అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనడం’అంటూ దర్శన చెప్పిన డైలాగ్ కథ, క్యారెక్టర్ పై చాలా క్యురియాసిటీని పెంచింది. విజువల్స్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. దర్శన రాజేంద్రన్ అద్భుతమైన పెర్ఫార్మర్. ఇందులో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే ఎక్స్ ట్రార్డినరీ క్యారెక్టర్ చేస్తోంది.      

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ “మేము సక్సెస్ఫుల్ గా షూటింగ్ పూర్తి చేసినందుకు నేను థ్రిల్‌గా వున్నాం. కష్టానికి ప్రాణం పోసే క్షణం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు. 

నిర్మాత విజయ్ డొంకాడ మాట్లాడుతూ.. మేము విడుదలకు ఒక స్టెప్ దగ్గరగా వెళుతున్నప్పుడు మేము క్రియేట్ చేసిన వరల్డ్ ని ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎదరుచూస్తున్నాం. 

చాలా పాషన్ తో ఈ సినిమా చేశాం. పరదా ఆడియన్స్ పై శాశ్వత ముద్ర వేసుకుంటుదని నమ్మకంగా వున్నాం’ అన్నారు. 

ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కొన్ని గ్రామాలలోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.  

గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్.  

సినిమా విడుదలకు రెడీ అవ్వడంతో మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్స్ తో రాబోతున్నారు. 

తారాగణం: అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత

సాంకేతిక విభాగం:

బ్యానర్: ఆనంద మీడియా

దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల

నిర్మాతలు: విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కొప్పు

సంగీతం: గోపీ సుందర్

సాహిత్యం: వనమాలి

రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి

స్క్రిప్ట్ డాక్టర్: కృష్ణ ప్రత్యూష

డీవోపీ: మృదుల్ సుజిత్ సేన్

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్

ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ

కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ

పీఆర్వో: వంశీ-శేఖర్

పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను

Latest News

వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో 'హరి హర వీరమల్లు' ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై...

More News