ఇద్దరు సినిమా వరల్డ్ వైడ్ గా ఈనెల 18న బ్రహ్మాండమైన విడుదల

Must Read

యాక్షన్ కింగ్ అర్జున్, జె డి చక్రవర్తి కాంబినేషన్లో డి. ఎస్. రెడ్డి సమర్పణలో ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పై మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమ నిర్మాతగా ఎస్ ఎస్ సమీర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇద్దరు. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, టి. ప్రసన్నకుమార్ గారు, జె వి ఆర్ గారు పాల్గొన్నారు. ఈ సినిమా ఈనెల 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతూ : ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మా అన్న టి. ప్రసన్నకుమార్ గారికి, జె.వి.ఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమీర్ గారు నాకు ఎంతో మంచి ఆప్తులు. నేను డైరెక్ట్ చేసిన సినిమాకి ఆయన కో డైరెక్టర్ గా పని చేశారు. చాలా తెలివైన వ్యక్తి. యాక్షన్ కింగ్ అర్జున్ గారు మరియు జెడి చక్రవర్తి గారితో ఒక మంచి సినిమాను తీశారు. మిగతా ఆర్టిస్టులు కూడా అందరూ చాలా కష్టపడ్డారు. ప్రేక్షకుల సినిమా ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

టి. ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ : చిన్న సినిమా పెద్ద సినిమా చూడకుండా సినిమా ని సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జె డి చక్రవర్తి గారు సాంగ్ కి డాన్స్ చేసింది మా సినిమాకే అది మాల్గడి సాంగ్ పెద్ద హిట్ అయింది. జెడి చక్రవర్తి గారు, అర్జున్ గారు ఇద్దరూ టెక్నికల్ వాల్యూస్ తెలిసిన వ్యక్తులే. సమీర్ జెడి చక్రవర్తి గారు పనిచేస్తూ ఆ టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత డి ఎస్ రెడ్డి గారు మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి విచ్చేసిన టి ప్రసన్నకుమార్ గారికి, ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, జె.వి.ఆర్ గారికి కృతజ్ఞతలు. ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీతో తీసిన సినిమా. ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ సోని చరిష్ట మాట్లాడుతూ : నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సమీర్ గారికి కృతజ్ఞతలు. అర్జున్ గారు చక్రవర్తి గారు సినిమాలో నాకు చాలా సపోర్ట్ చేశారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులు, మీడియా మా సినిమా సపోర్ట్ చేసి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత మరియు దర్శకుడు సమీర్ గారు మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రసన్న కుమార్ గారికి, రామకృష్ణ గౌడ్ గారికి, జే వి ఆర్ గారికి, రవి గారికి, డిఎస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మంచి లొకేషన్స్ లో హై క్వాలిటీ లో చేసాము. అర్జున్ గారు, చక్రవర్తి గారు పోటీ పడుతూ నటించారు. హీరోయిన్స్ గా రాధిక కుమారస్వామి గారు, సోనీ గారు ఇద్దరూ చాలా బాగా నటించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ గారికి ఇది చివరి సినిమా. కె. విశ్వనాథ్ గారు ఇష్టంగా చేసిన సినిమా ఇది. అంతేకాకుండా ఒక పాటలో స్టెప్స్ కూడా వేశారు. అమీర్ ఖాన్ గారి తమ్ముడు ఫైజల్ ఖాన్ గారు కూడా ఈ సినిమాలో నటించిన జరిగింది. అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరూ ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
యాక్షన్ కింగ్ అర్జున్, జెడి చక్రవర్తి, రాధిక కుమారస్వామి, కె విశ్వనాథ్ గారు, సమీర్, సోనీ చరిష్ట

బ్యానర్: ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్
దర్శకుడు: ఎస్ ఎస్ సమీర్
నిర్మాత: Md. ఫర్హీన్ ఫాతిమా
డి ఓ పి: అమీర్ లాల్
సంగీతం: సుభాష్ ఆనంద్
ఎడిటింగ్: ప్రభు
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధుVR

Latest News

Actor Yogesh Kalle in the Pan India Film Trimukha

Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in which nassar, CID Aditya...

More News