‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ కోసం ఒకటైన గ్లోబల్ స్టార్స్ – హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

ఇండియన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ మొదటిసారిగా ఒక ఎక్స్‌క్లూజివ్ వర్చువల్ సంభాషణ ద్వారా ఒకటయ్యారు. స్పేస్, సైన్స్, సినిమాలపై తమకున్న ఆసక్తిని పంచుకుంటూ ఈ ఇద్దరు గ్లోబల్ ఐకాన్స్ చేసిన ఈ ముఖాముఖి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వీరి చర్చ ప్రధానంగా రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం “ప్రాజెక్ట్ హెయిల్ మేరీ” చుట్టూ సాగింది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కోయి… మిల్ గయా’కి ఈ కొత్త చిత్రానికి ఉన్న భావోద్వేగపరమైన పోలికలను వారు గుర్తుచేసుకున్నారు. ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించుకోవడమే కాకుండా, భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలపై కూడా వారు సూచనలు ఇచ్చారు.

ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ చిత్రంలో ర్యాన్ గాస్లింగ్ మెమరీ లాస్ కి గురైన రైలాండ్ గ్రేస్ పాత్రను పోషించారు. శాండ్రా హుల్లెర్, లియోనెల్ బాయిస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

అమెజాన్ MGM స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ పంపిణీ చేస్తోంది. ఈ సినిమా మార్చి 26, 2026న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో భారతదేశ వ్యాప్తంగా IMAX, అలాగే ఇతర ప్రీమియం ఫార్మాట్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.

TFJA

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

23 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

23 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

23 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago