మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “పళ్లిచట్టంబి”. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. “పళ్లి చట్టంబి” సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు “పళ్లిచట్టంబి” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – ప్రఖ్యాతిగాంచిన ఒక పురాతన చర్చి నేపథ్యంగా ఆసక్తికరంగా ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఆ భగవంతుడి ఆలయం మీద కొందరు దెయ్యాల్లాంటి మనషుల కన్నుపడుతుంది. ఆ రాక్షసులు అమాయకులైన ప్రజల్ని హింసించడం టీజర్ లో చూపించారు. ‘మనుషులు సైతాను ఎదురెదురుగా ఉండే ప్రదేశంలో దేవుడితో పనేంటి..’ అనే డైలాగ్ ఈ మూవీ నేపథ్యం, కథలోని కాన్ ఫ్లిక్ట్ ఎలా ఉండబోతోంది అనే అంశాలపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ ఆలయాన్ని, అమాయక ప్రజల్ని కాపాడేందుకు కథానాయకుడు ఎలాంటి పోరాటం చేశాడు అనేది టీజర్ కు హైలైట్ గా నిలుస్తోంది. 50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ మూవీలో హీరో టొవినో థామస్ సరికొత్తగా కనిపించి ఆకట్టుకుంటున్నారు.
నటీనటులు – టొవినో థామస్, కయదు లోహర్, విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్, తదితరులు
కాస్ట్యూమ్స్ – మంజూష రాధకృష్ణన్
మేకప్ – రషీద్ అహ్మద్
ప్రొడక్షన్ డిజైన్ – దిలీప్ నాథ్
ఎడిటింగ్ – శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ – టిజో టోమీ
మ్యూజిక్ – జేక్స్ బిజోయ్
స్క్రిప్ట్ – ఎస్ సురేష్ బాబు
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – మేఘశ్యామ్, తంజీర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్
డైరెక్టర్ – డిజో జోస్ ఆంటోనీ
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…