ప్రముఖ కళా దర్శకులు శ్రీ తోట తరణి గారికి ఫ్రాన్స్ ప్రభుత్వం చెవాలియర్ డె లా లీజియన్ డి హానర్ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషాన్ని కలిగించింది. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మన దేశ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ కళా దర్శకుల్లో శ్రీ తరణి గారు ముందు వరుసలో ఉంటారు. ఎటువంటి కథాంశానికైనా సహజత్వం ఉట్టిపడేలా సెట్స్ రూపొందిస్తారు. వర్తమాన సమాజానికి సంబంధించిన కథ కావచ్చు, చారిత్రక గాథ అయినా, భక్తి భావ చిత్రమైనా… ఏదైనా శ్రీ తరణి గారు అధ్యయనం చేసి చక్కటి డ్రాయింగ్స్ వేసి సెట్స్ తీర్చిదిద్దుతారు. హరిహర వీరమల్లు చిత్రానికి ఆయనే కళా దర్శకత్వం వహించారు. ఆయన నుంచి నవతరం స్ఫూర్తి పొందాలి. శ్రీ తరణి గారు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి

