పూరీ కనెక్ట్స్‌ క్రేజీ ప్రాజెక్ట్’ డబుల్ ఇస్మార్ట్‌’

ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌’. వారి గత బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడంతో ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్‌ అయ్యారు. విషు రెడ్డి సీఈవో.

 మేకర్స్ ఈ రోజు ఒక బిగ్ అప్‌డేట్‌తో వచ్చారు. బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌ డబుల్‌ ఇస్మార్ట్‌లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఆయన మొదటి షెడ్యూల్‌ షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈరోజు, సంజయ్ దత్ పాత్రను బిగ్ బుల్‌గా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఫంకీ హెయిర్‌డో, గడ్డం, చెవిపోగులు, ఉంగరాలు, ఖరీదైన గడియారం, ముఖం, వేళ్లపై పచ్చబొట్టుతో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు సంజయ్ దత్. ఈ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంజయ్ దత్ సిగార్ తాగుతున్నట్లు కనిపించారు. గన్స్ అతని వైపు గురిపెట్టినట్లు కనిపిస్తున్నాయి. సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

తన నటీనటులను బెస్ట్ మాస్ అప్పీలింగ్‌ లో ప్రజంట్ చేయడంతో దిట్ట అయిన పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్‌’ లో సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు.

రామ్, సంజయ్ దత్‌లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎక్సయిటింగ్ గా ఉంటుంది. ఈ వైల్డ్ కాంబినేషన్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

సినిమా కోసం పని చేస్తున్నందుకు తన ఆనందాన్ని పంచుకున్నారు సంజయ్ దత్. ”డైరెక్టర్ ఆఫ్ ది  మాసెస్ పూరీ జగన్నాధ్ జీ, యంగ్ ఎనర్జిటిక్ ఉస్తాద్  రామ్ తో కలసి సైన్స్‌ ఫిక్షన్ మాస్ ఎంటర్ టైనర్  ‘ డబుల్ ఇస్మార్ట్‌’ లో బిగ్ బుల్ పాత్ర చేయడం ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. ఈ సూపర్-టాలెంటెడ్ టీమ్‌తో జతకట్టడానికి సంతోషిస్తున్నాము. 2024 మార్చి 8 ‘ డబుల్ ఇస్మార్ట్‌’ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ట్వీట్ చేశారు.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు మేకర్స్.

డబుల్ ఇస్మార్ట్  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.  

తారాగణం: రామ్ పోతినేని, సంజయ్ దత్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
డివోపీ: జియాని గియాన్నెల్లి
స్టంట్ డైరెక్టర్: కేచ
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

1 day ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

1 day ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

1 day ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago