ఓ అమ్మాయి అబ్బాయి మనస్పూర్తిగా ప్రేమించుకుంటారు. వారి మధ్య అంతరాలు వారి ప్రేమకు అడ్డంకిగా ఎలా మారింది? దాన్ని వారెలా దాటి ముందుకెళ్లారు.. వారి ప్రేమ సక్సెస్ అయ్యిందా? అనే విషయం తెలుసుకోవాలంటే ‘మాధవే మధుసూదనా’ సినిమా చూడాలంటున్నారు దర్శక నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు.
బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాధవే మధుసూదనా’ సినిమా టీజర్‌ను గురవారం విష్ణు మంచు విడుదల చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో…
విష్ణు మంచు మాట్లాడుతూ ‘‘మాధవే మధుసూదనా’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్. సినీ ఇండస్ట్రీలో ఓ యాక్టర్‌కి, మేకప్ మేన్‌కి ఉన్న బంధం భార్యాభర్తల్లాంటిది. నేను చిన్నప్పటి నుంచి చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైటర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా సినిమా చేయటం అంత సామాన్యమైన విషయం కాదు. ఆయన మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. హీరో తేజకి అభినందనలు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శక నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు మాట్లాడుతూ ‘‘నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా అన్నపూర్ణ స్టూడియో సంస్థకు, నాగార్జనగారికి రుణపడి ఉంటాను. అలాగే మోహన్‌బాబుగారికి ఫోన్ చేయగానే నాకు అండగా ఉంటానని చెబుతూనే ఆయన సింగపూర్‌లో ఉండటం వల్ల రాలేనని అన్నారు. ఆయన స్థానంలో విష్ణుని పంపుతానని అన్నారు. అందుకు ఆయనకు థాంక్స్.
కె.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘క్రమశిక్షణ, నిబద్దత కారణంగానే ఈరోజు చంద్ర దర్శకుడి, నిర్మాతగా, రైటర్‌గా సినిమాను చేస్తున్నారు. ఆయన తన కొడుకు తేజను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.
హీరోయిన్ రిషిక లోక్రే మాట్లాడుతూ ‘‘సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే వచ్చిన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది. అవకాశం ఇచ్చిన చంద్రగారికి, సపోర్ట్‌గా నిలిచిన తేజగారికి థాంక్స్’’ అన్నారు.
హీరో తేజ్ బొమ్మదేవర మాట్లాడుతూ ‘‘నాకు సపోర్ట్ చేసి వారి బ్లెస్సింగ్స్ అందించిన నాగార్జున గారికి, చైతన్య గారికి, విష్ణు గారికి, బ్రహ్మానందం గారికి థాంక్స్. మా నాన్నగారి సంకల్పమే ఆయన్ని గొప్ప మేకప్ మేన్‌గా చేసింది. అదే ఈరోజు నన్నిక్కడ నిలబెట్టింది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బాడిస మాట్లాడుతూ ‘‘నాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన చంద్రగారికి థాంక్స్ చెబుతున్నాను. సినిమా లో నాలుగు పాటలున్నాయి. అన్నీ పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. రెండు పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. హీరో తేజ్ మంచి అనుభవమున్న యాక్టర్‌గా నటించారు. మా మూవీకి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
డైరెక్టర్ సముద్ర, ఆదిత్య నిరంజన్, సురేష్ కొండేటి, ప్రసన్నకుమార్, వై.వి.ఎస్.చౌదరి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.
నటీ నటులు: తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే, జయ ప్రకాష్, శైలజా ప్రియ, బి. రామచంద్ర రావు, నవీన్ నేని, రవి శివ తేజ, మాస్టర్ అజయ్, అంజలి, శ్రీ లత తదితరులు.
సాంకేతిక వర్గం: సమర్పణ : బొమ్మ దేవర శ్రీదేవి, బ్యానర్ : సాయి రత్న క్రియేషన్స్, రచన దర్శకత్వం : చంద్ర, నిర్మాత : బొమ్మ దేవర రామచంద్ర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : వాసు, సంగీతం : వికాస్ బాడిస, ఎడిటింగ్ : ఉద్దవ్ ఎస్ బి, మాటలు : బి సుదర్శన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం – బృంద, డాన్స్: రఘు & యశ్, పాటలు : శ్రీమణి, అనంత శ్రీరామ్, శ్రీ సిరాగ్, కో డైరెక్టర్ : వాయుపుత్ర, పి.ఆర్.ఓ : పర్వతనేని రాంబాబు, సాయి సతీష్, పబ్లిసిటీ డిజైనర్ : డ్రీమ్ లైన్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మానుకొండ మురళీకృష్ణ.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…