‘జిలేబి సినిమా నుంచి ఆకు పాకు పాట విడుదల


నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజ‌య‌భాస్కర్ త‌న‌యుడు శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జిలేబి హిలేరియస్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ అని టీజర్ భరోసా ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆకు పాకు’ అనే పాటని విడుదల చేశారు మేకర్స్. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ పాటని క్యాచి నెంబర్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ గా పాడిన ఈ పాటలో లీడ్ పెయిర్ కంగారు పడుతూ పరుగులు తీయడం థ్రిల్లింగ్ గా వుంది.

ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ కాగ, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: శ్రీకమల్, శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు.

సాంకేతిక విభాగం:
దర్శకత్వం : కె. విజ‌య‌భాస్కర్
నిర్మాత: గుంటూరు రామకృష్ణ
బ్యానర్ : ఎస్ఆర్కే ఆర్ట్స్
సమర్పణ : అంజు అశ్రాని
సంగీతం: మణిశర్మ
డీవోపీ: సతీష్ ముత్యాల
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
పీఆర్వో : వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago