ఘనంగా “సీఎం పెళ్లాం” సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్

జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “సీఎం పెళ్లాం”. ఈ చిత్రాన్ని ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. దర్శకుడు గడ్డం వెంకట రమణరెడ్డి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో “సీఎం పెళ్లాం” సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు మా సినిమా సీఎం పెళ్లాం టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. రాజకీయ నేపథ్యంతో సాగే మంచి సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. మనం ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం చూశాం. మా మూవీలో సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాం. చాలా మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ – దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి గారు ఒక మంచి స్క్రిప్ట్ నాకు వినిపించారు. వెంటనే మూవీ స్టార్ట్ చేశాం. రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా ఇది. మహిళా సాధికారత గురించి కూడా కంటెంట్ ఉంటుంది. సుమన్ గారు, ఇంద్రజ, అజయ్ గారితో మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక మంచి ప్రయత్నం చేశాం. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ – సీఎం పెళ్లాం సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. రొటీన్ కు భిన్నమైన పాత్రలో కనిపిస్తా. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. డైరెక్టర్ వెంకటరమణారెడ్డి పూర్తి స్క్రిప్ట్ తో ప్రతి డీటెయిల్ తో రెడీ అయ్యి సినిమా చేశారు. ఆయన డెడికేషన్ నాకు నచ్చింది. నాతో పాటు ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రలు చేశారు. అజయ్ మంచి నటుడు, అతను ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఇంద్రజ గతంలో నాతో పాటు హీరోయిన్ గా నటించింది. ఆమెతో మళ్లీ మూవీ చేయడం హ్యాపీగా ఉంది. చాలా మంచి ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. మన రాజకీయ, బ్యూరోక్రాట్ వ్యవస్థను ప్రశ్నిస్తూ ఒక మంచి మూవీ చేశారు దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి. ఈ సినిమాకు మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

నటి ఇంద్రజ మాట్లాడుతూ – సుమన్ గారితో ఎన్నో మూవీస్ చేశాను. ఆయన మంచి మనసు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉంది. ఆయన అప్పటికే స్టార్ హీరో అయినా కొత్త హీరోయిన్ గా వచ్చిన నాతో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. సీఎం పెళ్లాం క్యారెక్టర్ లో సీఎం భార్య పాత్రలో నటించాను. ఈ పాత్రను నేను చేయగలను అని నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు గడ్డం వెంకటరమణరెడ్డికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇదొక ప్రత్యేకమైన సినిమా. మంచి సందేశాన్ని ఇస్తుంది. దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో రూపొందించారు. ఈ సినిమాలో అజయ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ టీజర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న అలీ గారికి థ్యాంక్స్. అలాగే ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటుడు అజయ్ మాట్లాడుతూ – సుమన్ గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది. అలాగే మహిళా సాధికారత గురించి కూడా మా డైరెక్టర్ చూపించారు. మా డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి గారి మంచితనం నన్ను ఆకట్టుకుంది. ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. ఇంద్రజ గారు ఈ సినిమాలో హీరో అని చెప్పాలి. ఒక మంచి మూవీ చేశాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ – దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి దర్శకత్వం మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాడు. 20 ఏళ్ల కిందట ప్రకాష్ రాజ్ గారితో ఓ సినిమా రూపొందించాడు. ఆ తర్వాత యూఎస్ఏ వెళ్లిపోయాడు. అక్కడ బాగా స్థిరపడ్డాడు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉండనీయదు కదా మళ్లీ వచ్చాడు. సీఎం పెళ్లాం అనే మంచి మూవీ రూపొందించాడు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నాడు.

నటి స్వాతి మాట్లాడుతూ – సీఎం పెళ్లాం సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశాను. నేను వరుణ్ సందేశ్ కుర్రాడు మూవీలో ఆయనకు చెల్లిగా నటించా. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై చదువు, ఉద్యోగంలో స్థిరపడ్డా. మళ్లీ ఈ మూవీతో ఇండస్ట్రీకి రావడం సంతోషంగా ఉంది. అన్నారు.

నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ – సీఎం పెళ్లాం సినిమాలో మంచి రోల్ చేశాను. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో మా ఆర్టిస్టులు ఎవరినీ ఇబ్బందులు పెట్టలేదు దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి గారు. ఆయన చాలా క్లారిటీగా మూవీ రూపొందించి మమ్మల్ని రోజు సెట్ నుంచి అనుకున్న టైమ్ కంటే ముందే పంపించేవారు. సీఎం పెళ్లాం సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

నటుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ – ఈ సినిమాలో నేను హోం మంత్రి పాత్రలో నటించాను. పొలిటికల్ నేపథ్యంతో సాగే ఒక మంచి చిత్రమిది. ఈ చిత్రంలో ఇంద్రజ, సుమన్, అజయ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ బొల్లా రామకృష్ణ గారికి థ్యాంక్స్. అన్నారు.

నటీనటులు – జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్, ఘర్షణ శ్రీనివాస్, మురళీధర్, ప్రీతి నిగమ్, రూపా లక్ష్మి, స్వాతి, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – ఆర్ కే సినిమాస్
సంగీతం – ప్రిన్స్ హెన్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – గుత్త రాజేష్
పీఆర్ఓ – సురేష్ కొండేటి
కో ప్రొడ్యూసర్ – బొల్లా వెంకటేశ్వరరావు
నిర్మాత – బొల్లా రామకృష్ణ
రచన దర్శకత్వం – గడ్డం వెంకటరమణ రెడ్డి.

Tfja Team

Recent Posts

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

21 hours ago

‘ఎర్రచీర’ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఫిబ్రవరి 6న నేను టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా: మాజీ ఎంపీ మధు యాష్కి

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ…

22 hours ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్అమరావతి

ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…

22 hours ago

బరాబర్ బాధపడుతున్నాను!!

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన…

22 hours ago

3 వేల ఎంట్రీలు, 100 మంది ఫైనలిస్టులు.. AVAA జర్నీకి శ్రీకారం చుట్టిన విష్ణు మంచు,హోస్ట్‌గా శివ బాలాజీ

సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా…

22 hours ago

టాలెంటెడ్ హీరో లెజెండ్ శరవణన్ “లీడర్” సినిమా గ్లింప్స్ రిలీజ్, ఏప్రిల్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…

22 hours ago