సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న’పొట్టేల్’ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ మూవీ. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింతగా పెంచింది. పల్లెటూరి వాతావరణంలో జరిగే సినిమాల్లో ఎమోషన్స్ పండితే అద్భుతాలు సృష్టిస్తాయి.
ఈ సినిమాలోని మొదటి 3 పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. ఇప్పుడు మేకర్స్ ఫోర్త్ సింగిల్‌ను విడుదల చేశారు.
“బుజ్జి మేక” సాంగ్ ఈ సినిమా ఎసెన్స్ ని ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ ట్రాక్. శేఖర్ చంద్ర పవర్ ఫుల్ కంపోజిషన్, కాసర్ల శ్యామ్ అందించిన ఎమోషనల్ లిరిక్స్ తో ఈ పాట మోస్ట్ హోటింగ్ గా ఆకట్టుకుంది. కాల భైరవ వోకల్స్ పాటకు ప్రాణం పోసాయి. ఎమోషన్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. పాటలోని విజువల్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ వర్క్ అందించడంతో ‘బుజ్జి మేక’ హార్ట్ టచ్చింగ్ సాంగ్ గా అలరిచింది.
పొట్టెల్ దర్శకుడిగా సాహిత్ మోత్ఖూరికి మూడో చిత్రం. ఇందులో యువ చంద్ర కృష్ణతో పాటు అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మాతలు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మోనిష్ భూపతి రాజు, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్షన్ నార్ని శ్రీనివాస్.
త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – సాహిత్ మోత్ఖురి
నిర్మాతలు – నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
బ్యానర్లు – నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
సంగీతం- శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ – మోనిష్ భూపతి రాజు
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్
లిరిక్స్ – కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
ఫైట్స్ – పృథ్వీ, రబిన్ సుబ్బు
పీఆర్వో – వంశీ శేఖర్
డిజిటల్ మీడియా – హాష్‌ట్యాగ్ మీడియా
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…