‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్ సాంగ్

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘మా ఊరు శ్రీకాకుళం’ టైటిల్ సాంగ్ ని లాంచ్ చేశారు.

సునీల్ కశ్యప్ ఈ సాంగ్ క్యాచి అండ్ టచ్చింగ్ నెంబర్ గా కంపోజ్  చేశారు. శ్రీకాకుళం గురించి సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. మంగ్లీ ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. విజువల్స్ సూపర్బ్ గా వున్నాయి.  

సాంగ్ లాంచింగ్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్ సాంగ్ లాంచ్ చేయడం చాలా అనందంగా వుంది. టైటిల్ చాలా ఫన్నీగా వుంది. మోహన్ నాకు రైటర్ గా ఉన్నప్పటి నుంచి పరిచయం. చాలా మంచి రైటర్. సాంగ్ చూశాను. మంగ్లీ అద్భుతంగా పాడింది. విజువల్స్ కూడా చాలా బావున్నాయి. వెన్నెల కిషోర్ గారి నుంచి ఒక డిఫరెంట్ సినిమా ఎక్సపెక్ట్ చేస్తున్నాం. యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ తెలిపారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక న నిపుణులు పని చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు.
మల్లికార్జున్ ఎన్ డీవోపీ గా, అవినాష్ గుర్లింక ఎడిటర్ గా పని చేస్తున్నారు. బేబీ ఫేం సురేష్ బిమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. : రాజేష్ రామ్ బాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల , సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహాద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ మహేష్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయ్ ఐడ్రీం నాగరాజు, ఎంవీఎన్ కశ్యప్..

టెక్నికల్ టీం :
రచన, దర్శకత్వం: రైటర్ మోహన్
బ్యానర్:  శ్రీ గణపతి సినిమాస్
నిర్మాత: వెన్నపూస రమణ రెడ్డి
సమర్పణ: లాస్య రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజేష్ రామ్ బాల
సంగీతం: సునీల్ కశ్యప్
డీవోపీ: మల్లికార్జున్ ఎన్
ఎడిటర్ : అవినాష్ గుర్లింక
ఆర్ట్ డైరెక్టర్ : బేబీ సురేష్
స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్
పీఆర్వో: వంశీ శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

15 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

15 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

15 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago