‘భవనమ్’ మంచి హారర్ కామెడీ ఎంటర్ హీరో సప్తగిరి &టీం

Must Read

అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, అజయ్, మాళవిక సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలలో బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘భవనమ్’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సప్తగిరి మాట్లాడుతూ… సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ 95 వ సినిమాగా ఇంతమంది కమెడియన్స్ ని పెట్టుకొని తొలిసారి వారి నిర్మాణంలో హారర్ కామెడీ సినిమా చేశారు చేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో పని చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది. మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు బాలాచారి కూరెళ్ల గారికి థాంక్ యు. ఆర్ బి చౌదరి గారు చాలా సపోర్ట్ చేశారు. చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాతో గొప్ప విజయం మాకు, సంస్థకు, డైరెక్టర్ గారికి రావాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 9న సినిమా వస్తోంది. ప్రేక్షకులందతా థియేటర్ లో సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్  చేసి గొప్ప విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాను’ అన్నారు.

హీరో షకలక శంకర్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. బాలాచారి కూరెళ్ల అద్భుతంగా తీశారు, ఇందులో కామెడీ యాక్షన్ సాంగ్స్ అన్నీ వున్నాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న హారర్ కామెడీ ఇది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆగస్ట్ 9న సినిమా వస్తోంది. ప్రేక్షకులంతా తప్పకుండా చూసి సపోర్ట్ చేయాలి.

హీరోయిన్ మాళవిక సతీషన్ మాట్లాడుతూ.. ఇది హారర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా వున్న మంచి ఎంటర్ టైనర్. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఆగస్ట్ 9న కలుద్దాం’ అన్నారు.  

డైరెక్టర్ బాలాచారి కూరెళ్ల మాట్లాడుతూ.. ఆర్ బి చౌదరి గారు నాకు ఫస్ట్ విద్యార్ధి అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు భవనమ్ సినిమా ఇచ్చారు. వారిని జీవితంలో మర్చిపోలేను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. నటీనటులు, టెక్నిషియన్స్ చాలా అద్భుతంగా చేశారు. ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బావుంటుంది. అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. ఆర్ బి చౌదరి గారికి , వాకాడ అప్పారావు గారికి ధన్యవాదాలు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా వుంది. బాలచారి గారు అద్భుతమైన మ్యూజిక్ చేయించుకున్నారు. ఈ పాటలకు చాలా రెస్పాన్స్ వచ్చింది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’ అన్నారు. సినిమా యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.      

తారాగణం: సప్తగిరి, ధనరాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, బిత్తిరి సత్తి, అజయ్ , ప్రభాకర్ (బాహుబలి), గెటప్ శీను, మురళీ గౌడ్ , జీవన్ నాయుడు, శ్రవణ్ , నాగ మహేష్ , మాళవిక సతీషన్ , స్నేహ ఉల్లాల్ , స్నిగ్దా, మణిచందన, క్రాంతి, హాన్విక, హారిక

సమర్పణ: సూపర్ గుడ్ ఫిల్మ్స్ PVT LTD
నిర్మాతలు : ఆర్ బి చౌదరి, వాకాడ అంజన్ కుమార్, వీరేంద్ర సీర్వి
రచన, దర్శకత్వం: బాలాచారి కూరెళ్ల
డిఓపి : మురళీమోహన్ రెడ్డి ఎస్
ఎడిటర్: ఎన్టీఆర్
ఆర్ట్: వరతై ఆంటోని
స్టంట్స్ : స్టార్ మల్లి
కొరియోగ్రఫీ: బాలకృష్ణ, శ్యామ్ కుమార్
ఆర్ఆర్: DSR
డైలాగ్స్: బాలాచారి కూరెళ్ల
పీఆర్వో: వంశీ- శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News