అమల అక్కినేని చేతుల మీదుగా “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమా టీజర్ లాంఛ్

Must Read

చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “హనీమూన్ ఎక్స్ ప్రెస్”. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు.

ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ, “యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ప్రొఫెసర్ గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు. అమెరికాలో ఉన్న, ఆయనకు ఏదో ఒకరోజు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది. ఆయన కల ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. టీచింగ్ ఒక బాధ్యత అయితే ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్ ను బాల  హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ లోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్ గా ఉంది. ఈ రోజు సమాజంలోని రొమాంటిక్, వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈరోజు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే సబ్జెక్ట్ ఇది. ఈ నెల జూన్ 21న, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ని ఆదరించి, విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. బాల, ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను,” అన్నారు.

దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ, “నా మనసులో అన్నపూర్ణ స్టూడియోస్ కు ప్రత్యేక స్థానం ఉంది. చాలాకాలం నుంచి అమెరికా లో ఉన్న నన్ను, అమల గారు, నాగార్జున గారు ఇండియాకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కు డీన్ గా బాధ్యతలు అప్పగించారు. వాళ్ల ప్రోత్సాహంతో దర్శకుడిగా నా ఫస్ట్ తెలుగు మూవీ హనీమూన్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించాను. ఇందులో అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీ, స్టూడెంట్స్ ఇతర స్టాఫ్ అన్ని డిపార్ట్‌మెంట్లలో కీలకమైన పాత్రలు వహించారు. నా మెంటార్ గా భావించే నాగార్జున గారు మా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యడం విశేషం. అలాగే, అమల గారు టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అక్కినేని కుటుంబం నుంచి లభిస్తున్న ఈ సపోర్ట్ కు హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ తరుపున నా కృతజ్ఞతలు. మా మూవీ నుంచి టీ సిరీస్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేసిన నాలుగు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కల్యాణి మాలిక్ వీటిని కంపోజ్ చేశారు. స్ఫూర్తి జితేందర్ టైటిల్ సాంగ్ కు మ్యూజిక్ చేశారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జూన్  21న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సుచిన్  సినిమాస్ (Suchin Cinemas) డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు మా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు” అన్నారు.

సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))
బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)
చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్

నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు

సంగీతం : కళ్యాణి మాలిక్  
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా  వి ఎమ్ కె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
ఆడియో : టి సిరీస్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని

Latest News

Hakku initiative Mana Hakku Hyderabad curtain raiser song launched

Hakku Initiative, a social awareness campaign in partnership with the public and the government, launched the 'Hyderabad Curtain Raiser'...

More News