రంగమార్తాండ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారికి చెందుతుంది

Must Read

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాజ్యశ్యామల ఎంటర్ట్సైన్మెంట్స్ & హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్ పై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగమార్తాండ. విమర్శకుల ప్రసంశలు పొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటీపడి నటించారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను తీర్చి దిద్దిన తీరు అద్భుతం.

ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఇలా సినిమాకు ప్రతీది ఒక హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ హాస్పిటల్ ఎపిసోడ్ సినిమా చూసిన పతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అలా చక్రపాణి, రాఘవరావు పాత్రలు కొంతకాలం ప్రేక్షకుల మనసులో చారగని ముద్ర వేసుకున్నాయి.

తాజాగా జరిగిన 69వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ లో రంగమార్తాండ సినిమాకు రెండు అవార్డ్స్ వరించాయి. బెస్ట్ యాక్టర్ మేల్ క్యాటగిరిలో ప్రక్షాష్ రాజ్ కు అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ క్యాటగిరిలో బ్రహ్మానందం కు అవార్డ్స్ రావడం విశేషం.

ఈ సందర్భంగా నిర్మాత కాలిపు మధు మాట్లాడుతూ… “ఆగస్ట్ 5న పుట్టినరోజు జరుపుకుంటున్న నాకు ఈ పుట్టినరోజు చాలా ప్రేత్యేకం, మా రంగమార్తాండ సినిమా ఫిలిం ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం కృష్ణవంశీ గారికి చెందుతుంది, త్వరలో మరో మంచి ప్రాజెక్టు సుమంత్ గారితో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో “మహేంద్రగిరి వారాహి” సినిమాతో రాబోతున్నాననని తెలిపారు.

Latest News

ఏడిద నాగేశ్వరావు 9వ వర్ధంతి అక్టోబర్ 4న

తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు,ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది....

More News