హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన  ‘ఏకాంత సమయం’ లిరికల్ వీడియో

హుషారు,షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు తేజ్ కూర‌పాటి సోలో గా హీరోగా వస్తున్న చిత్రం “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.ఈ చిత్రంలో అఖిల ఆక‌ర్ష‌ణ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన  పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇందులోంచి ఓ పాటను విడుదల చేసారు మేకర్స్. డా భవ్య దీప్తి రెడ్డి రచించిన ‘ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియో ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ  సందర్బంగా

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ. హీరో శ్రీకాంత్ తో మేము ట్రావెల్ అవ్వాలనుకున్నాం. అయితే తను ఎంతో బిజీ ఉన్నా మా చిత్రంలోని  ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేసినందుకు వారికి మా ధన్యవాదములు.  దర్శకుడు వెంకట్ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. డా భవ్య దీప్తి రెడ్డి ఈ సినిమాకు చక్కటి ఐదు పాటలు రాయడం జరిగింది. సంగీత దర్శకుడు సందీప్ అందించిన మ్యూజిక్  ప్రేక్షకులకు ఇట్టే ఆకట్టుకుంటాయి.ఈ సినిమాలో నటించిన నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఈ చిత్రాన్ని ఓన్ చేసుకొని వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది అన్నారు.

చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ..హీరో శ్రీకాంత్ గారు ఎంతో బిజీ ఉన్నా మా చిత్రంలోని  ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు. వారికి చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు .ఒక రియాలిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అనుకున్న టైమ్ కు, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా తీశాము..ఈ సినిమాకు పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గార్ల తో  పాటు నటించిన వారు మరియు టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ వర్క్ చేశారు. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు  వెంకట్ వందెల మాట్లాడుతూ…ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌క‌థ గా ఈ చిత్రంగా తెర‌కెక్కించే ఈ చిత్రంలోని ‘ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియోను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదములు. ఇలాంటి మంచి చిత్రం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు.ఈ చిత్రంలో యూత్ కి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో వుంటాయి.  ప్రేమక‌థ తో పాటు చక్కటి వినొదాన్ని మిక్స్ చేసి తెర‌క్కించిన ఈ సినిమా  సెప్టెంబర్ 2  ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది అన్నారు.

యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి మాట్లాడుతూ..ఈ చిత్రంలోని ఏకాంత సమయం’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్  చేసిన హీరో శ్రీకాంత్ కు ధన్యవాదములు.
సినిమా చూశాను చాలా బాగుంది. ఎంతో ప్యాషన్ తో  నిర్మించిన చిత్ర నిర్మాతలకు ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు

న‌టీన‌టులు:

తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ , త‌ణికెళ్ళ భ‌ర‌ణి, క‌ల్ప‌నా రెడ్డి, జీవా, జొగి బ్ర‌ద‌ర్స్‌, అనంత్‌, బ‌స్టాప్ కోటేశ్వ‌రావు, డాక్ట‌ర్ ప్ర‌సాద్‌, మాధ‌వి ప్ర‌సాద్‌, సునీత మ‌నోహ‌ర్ త‌దిత‌లురు న‌టించ‌గా

టెక్నికల్ టీం:

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. ముల్లేటి నాగేశ్వ‌రావు
నిర్మాత‌లు.. ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బుల వెంక‌టేశ్వ‌రావు
క‌థ‌-స్క్రీన్‌ప్లే- మాటలు ద‌ర్శ‌క‌త్వం.. వెంక‌ట్ వందెల‌
సినిమాటోగ్ర‌ఫి.. పి.వంశి ప్ర‌కాష్‌
సంగీతం.. సందీప్ కుమార్‌
స్క్రీన్‌ప్లే- పాట‌లు.. డాక్ట‌ర్ భ‌వ్య ధీప్తి రెడ్డి
ఎడిట‌ర్‌.. నంద‌మూరి హరి
స్టంట్స్‌.. రామ కృష్ణ‌
కొరియోగ్ర‌ఫి.. గ‌ణేష్‌ మాస్టర్, నండిపు రమేష్
పి .ఆర్. ఓ :  మధు వి. ఆర్

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

10 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago