ZEE5 లో “హలో వరల్డ్ ” స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన కొద్దిరోజుల్లోనే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్

Must Read

ZEE5 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషలలో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా ZEE5 ప్రేక్షకులకు అందిస్తోంది. ZEE5 ప్రారంభం నుండి ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ స్టేబుల్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ‘గాలివాన’ ప్రదర్శించిన తర్వాత, ఇది ఇటీవల వచ్చిన ‘రెక్కీ, మరియు టాలీవుడ్ నటుడు సుశాంత్ OTT అరంగేట్రం చేసిన ‘మా నీళ్ల ట్యాంక్’ పేపర్ రాకెట్’. లు కూడా ఎంతో సూపర్ హిట్ అయ్యి వీక్షకుల మనసులు గెలుచు కున్నాయి.

Hello world launch trailer (Telugu) | A ZEE5 Original | Niharika Konidela | Premieres Aug 12th

తాజాగా సదా, ఆర్యన్ రాజేష్ లు కూడా OTT లో అరంగేట్రం చేసిన 8-ఎపిసోడ్‌ల ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్ గురించి ‘ప్రత్యేకంగా చెప్పాలంటే IT లో వర్క్ చేసే వారి జీవితాలు మరియు కెరీర్ సంబంధిత ఒత్తిడి, భయాలు మరియు ఆశలను ప్రతిబింబించేలా దర్శకుడు శివసాయి వర్ధన్ చక్కటి సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని తెరకెక్కించడం వల్ల ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ సిరీస్‌ను చాలా ఆసక్తిగా చూస్తున్నారు.తెలుగు మరియు తమిళంలో ఆగస్టు 12 నుండి ZEE 5 లో స్ట్రీమింగ్ అవుతున్న “హలో వరల్డ్’ వెబ్ సిరీస్ విడుదలైన కొద్ది రోజులకే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ తో దూసుకుపోతూ వీక్షకులను, యువత హృదయాలను గెలుచుకుంది.

ZEE5 వారు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ నిర్మాత నిహారిక కొణిదెల తో కలసి నిర్మించిన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తరువాత ఇదే బ్యానర్ లో “హలో వరల్డ్’ తో వరుసగా రెండవ హిట్ లభించడం విశేషం.ఈ సందర్బంగా

“హలో వరల్డ్” నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, ” ZEE5 తో కలసి చేసిన “హలో వరల్డ్” వెబ్ సిరీస్కు ఇంత ప్రోత్సాహకరమైన స్పందన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ ముఖ్యంగా నేటి యువతను ఆకట్టుకుంది. ఐ టి లో వారు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడానికి మేము నిజాయితీగా ప్రయత్నించాము . కార్పొరేట్ సెటప్‌లో పని-జీవితం మరియు కార్పొరేట్ జీవితం కోరే దాని యొక్క సారాంశాన్ని వివరించడానికి ప్రయత్నించాము. మా ప్రయత్నానికి వీక్షకుల నుండి విపరీతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్పందనతో మేము డిజిటల్ రంగంలో మరెన్నో మైలురాళ్లను దాటే ప్రోత్సాహాన్ని కల్పించారు.

“నేను గతంలో చాలా సంవత్సరాల IT లో పని చేశాను. ఆ అనుభవం తో కొంత కల్పితం జోడించి ఈ స్క్రిప్ట్ రాకున్నాను. ‘హలో వరల్డ్’ ఒక ఐటి వారికే కాకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ వెబ్ సిరీస్ ను చూసిన వారందరూ కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అని దర్శకుడు ఇటీవల చెప్పిన అతని అంచనా నిజమైంది.

Zee5 తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ..నిర్మాత నిహారిక కొణిదెల సహకారంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.ఈ ‘హలో వరల్డ్’ సిరీస్ దేశవ్యాప్తంగా ఉన్న ఐటి వారికే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతూ అందరి ఆధారాభిమానాలు పొందుతుంది .నేటి కార్పొరేట్ ప్రపంచం లోకి అడుగుపెట్టే యువ టెక్కీల మనోభావాలను అన్వేషించే డ్రామాగా తెరాకెక్కిన “హలో వరల్డ్’ వెబ్ సిరీస్ వీక్షకులకు ఎంతో రిఫ్రెసింగ్ గా ఉంటుంది ఈ సిరీస్ విడుదలైన కొద్ది రోజులకే 100 మిలియన్ల మినిట్స్ వ్యూస్ సాధించడం అంటే మాములు విషయం కాదు. అందుకు ZEE5 వీక్షకులకు ధన్యవాదాలు.ZEE5లో, మా ప్రేక్షకుల రోజువారీ జీవితాల నుండి స్ఫూర్తిని పొందే కథనాలను అందించడానికి మేము నిరంతరం కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నాము అన్నారు.

తారాగణం:

రాఘవగా – ఆర్యన్ రాజేష్, సదా – ప్రార్ధనగా, సిద్దార్థ్‌గా – రామ్ నితిన్, మేఘనగా – నయన్ కరిష్మా, వరుణ్‌గా – సుదర్శన్ గోవింద్, ప్రవల్లికగా – నిత్యా శెట్టి, రాహుల్‌గా – నికిల్ వి సింహా, వర్ష పాత్రలో – అపూర్వరావు, సురేష్‌గా – గీలా అనిల్, అమృతగా – స్నేహల్ ఎస్ కామత్, దేబాశిష్‌గా – రవి వర్మ, ఆనంద్‌గా – జయప్రకాష్

సాంకేతిక నిపుణులు

దర్శకుడు: శివసాయి వర్ధన్ జలదంకి, నిర్మాత: నిహారిక కొణిదెల, ప్రొడక్షన్ హౌస్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, స్క్రిప్ట్ రైటర్: శివసాయి వర్ధన్ జలదంకి, సినిమాటోగ్రాఫర్: ఎదురురోలు రాజు, సంగీత దర్శకుడు: PK ధండి, ఎడిటర్: ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ, కాస్ట్యూమ్ డిజైనర్: ఆంషి గుప్తా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News