“రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య  ‘షష్టి పూర్తి’ చూడండి .. డెఫినెట్ గా బావుంటుంది.”  – ‘మాస్ మహారాజా‘ రవితేజ

Must Read

నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్, జాతీయ ఉత్తమ నటి అర్చన కాంబినేషన్ లో రూపేష్,ఆకాంక్ష సింగ్  హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘షష్టి పూర్తి ‘ . పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మేస్ట్రో’ ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇందులో తొలిపాటను ఆస్కార్ విన్నర్ కీరవాణి రచించగా ఇటీవల విడుదల చేశారు.సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేసిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. రెండో పాటను ‘మాస్ మహారాజా’ రవితేజ ఆవిష్కరించి, యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ –“మా రాజేంద్రప్రసాద్ అన్నయ్య ‘షష్టి పూర్తి’ చూడండి.. డెఫినెట్ గా బావుంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందనిపిస్తోంది. దర్శక నిర్మాతలకు,ఆర్టిస్టులకు అందరికీ ఆల్ ది బెస్ట్ “ అని చెప్పారు.

Iru Kanulu Kanulu - Lyrical Video | Shashtipoorthi | Rupeysh, Aakanksha, Ilaiyaraaja, Pavan Prabha

”ఇరు కనులు కనులు కలిసి మురిసె మొదటి చూపులో
తొలి పిలుపు తగిలి మెరుపు మెరిసే మనసు నింగిలో “…అంటూ రెహమాన్ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్ , విభావరి ఆలపించారు. ఆ విశేషాలను దర్శకుడు పవన్ ప్రభ తెలియజేస్తూ “సినిమాలో చాలా అందమైన యుగళ గీతం ఇది. ఇళయరాజా గారు బాణీ ఇవ్వగానే నాకు ‘సాగర సంగమం’ లో ‘మౌనమేలనోయి ‘పాటలాంటి గొప్ప పాట అవుతుందనే అనుభూతి కలిగింది. ఈ ట్యూన్ కి రెహమాన్ శరవేగంతో సాహిత్యం సమకూర్చారు.

ఇళయరాజా గారు ఒక్క కరక్షన్ కూడా చెప్పకుండా ఓకే చెప్పేశారు. ఎస్పీ చరణ్,విభావరితో ఈ పాట పాడించారు. అసలు ట్యూన్ వినగానే నాదీ,
రూపేష్ గారి మొహాలు వెలిగిపోయాయి. ఇక మొత్తం పాట రికార్డు అయ్యాక మా మొహాల్లో వెన్నెల కురిసినంత ఆనందం. అసలు ఈ పాట రికార్డింగ్ కూడా చాలా లవ్లీ గా ,లైవ్లీ గా జరిగింది. సింగర్స్ ఎవరిదారిన వాళ్ళు వచ్చి పాడి వెళ్లిపోకుండా ఇద్దరూ పక్క పక్కన నిలబడి ఓ ఫీల్ తో ఈ డ్యూయట్ ని ఆలపించారు.

కధలో సమ్మిళితమైన ఈ పాట, ఈ సినిమాకే కొత్త అందాన్ని,అనుభూతిని తీసుకొచ్చింది. ఈ పాట చిత్రీకరణని రాజమండ్రి లో ఈశ్వర్ నృత్య దర్శకత్వంలో తీశాం. మంచి ఎండల్లో అందరూ కస్టపడి,ఇష్టపడి ఈ పాట బాగా రావడానికి సహకరించారు. ముఖ్యంగా మా ఛాయాగ్రాహకుడు రామ్ రెడ్డి. మామూలుగానే గోదావరి అందంగా ఉంటుంది. ఇక తోట తరణి గారి కళా దర్శకత్వ నైపుణ్యం వల్ల ఈ పాటలో గోదావరి రెట్టింపు అందంతో కనిపిస్తుంది. మా హీరో హీరోయిన్లు రూపేష్,ఆకాంక్ష సింగ్ లపై  ఈ పాటను చిత్రీకరించాం” అన్నారు.

రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ ,  ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, ‘చలాకి’ చంటి, ‘బలగం’ సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అంబరీష్ అప్పాజీ ఇందులో ప్రధాన తారాగణం.

‘షష్టిపూర్తి’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: అయేషా మరియం; పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను; పీఆర్వో: పులగం చిన్నారాయణ; మార్కెటింగ్: టాక్ స్కూప్; ప్రొడక్షన్ కంట్రోలర్: బిఎస్ నాగిరెడ్డి; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్; స్టంట్స్: రామకిషన్; ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, కొరియోగ్రఫీ: స్వర్ణ మాస్టర్, నిక్సన్ మాస్టర్, ఈశ్వర్ పెంటి, లిరిక్స్: కీరవాణి, చైతన్య ప్రసాద్, రెహమాన్; కో డైరెక్టర్: సూర్య ఇంజమూరి; డీఓపీ: రామ్, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, బ్యానర్: మా ఆయి ప్రొడక్షన్స్; నిర్మాత: రూపేష్, స్క్రీన్ ప్లే- సంభాషణలు- దర్శకత్వం : పవన్ ప్రభ.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News