ధనుష్, శ్రుతిహాసన్ జంటగా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన “3” సినిమా పదేళ్ళ క్రితం తెలుగు, తమిళ భాషలలో విడుదలై, అప్పటి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాను విడుదల చేసిన నిర్మాత నట్టి కుమార్ తన పుట్టిన రోజున సందర్భంగా గురువారం ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో విడుదల చేశారు. కాగా ఈ సినిమా టిక్కెట్లు బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ తో థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్ తో నడుస్తున్నాయి. సినిమాకు విశేషమైన స్పందన లభిస్తుండటంతో సంఖ్యాపరంగా థియేటర్లు బాగా పెరిగాయి.
ఇదిలాఉండగా, సోషల్ మీడియాలో ఈ సినిమాకు ఎంతగానో ప్రచారం చేసిన హీరోయిన్ శ్రుతి హాసన్ కు నిర్మాత నట్టి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఎంచక్కా..ఈ సినిమా పట్ల తనకున్న మక్కువ కారణంగా హైదరాబాద్ కు ప్రత్యేకంగా విచ్చేసి, స్థానిక గచ్చిబౌలి లోని AMB (ASIAN MAHESH BABU MULTIFLEX)లో గురువారం సాయంత్రం 7-30 గంటల షోకు ఎవరూ గుర్తు పట్టకుండా శ్రుతి హాసన్ మాస్క్ ధరించి, సినిమా ఆడుతున్న థియేటర్లోకి ఉన్నట్లుండి ప్రవేశించారు. దాంతో ఒక్కసారి సినిమా చూస్తున్న ప్రేక్షకులు అచ్చెరువొందారు. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు సందడి చేసిన శ్రుతి హాసన్ ఓ పాట కూడా పాడారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…