‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ : తెలుగులో ఈ నెల 15న విడుదల

శింబు-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో
‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ : తెలుగులో ‘ శ్రీ స్రవంతి మూవీస్’ ద్వారా ఈ నెల 15న విడుదల



  తమిళ స్టార్ హీరో శింబు,  స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలూ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మూడో సినిమాగా  ‘ వెందు తనిందదు కాడు’ రూపొందింది. సిద్దీ ఇధ్నానీ  ఇందులో కథానాయక. ఏఆర్ రెహమాన్ స్వరాలందించారు.

రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి.కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.

ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ  ‘’ ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా పాజిటివ్ గా ఉందనిపించింది. శింబు యాక్టింగ్ గురించి, గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి, రెహమాన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శింబూ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే గౌతమ్ మీనన్ కి కూడా. ఇంతకు ముందు మా ‘స్రవంతి’ సంస్థలో ‘నాయకుడు’ , ‘ పుష్పక విమానం’ , ‘ రెండు తోకల పిట్ట’, రఘువరన్ బీటెక్’ చిత్రాలు డబ్ చేశాం.

అవి తెలుగులో సంచలన  విజయం సాధించాయి. ఇప్పుడు ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ తో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే కాన్సెప్ట్ ఇది. ఈ నెల 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాo’’ అని తెలిపారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago