రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి


కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన ‘అనగనగా ఒక రాజు’
నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయం
యూఎస్‌లో హ్యాట్రిక్ $1 మిలియన్.. $2 మిలియన్ దిశగా పరుగులు

మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి, తాజా సంచలన విజయం ‘అనగనగా ఒక రాజు’తో మరో స్థాయికి చేరుకున్నారు. ఈ చిత్రం నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100.2 కోట్ల గ్రాస్‌ను సాధించి, బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ సంక్రాంతి పండుగను మరింత వైభవంగా మార్చింది.

సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం, మొదటి షో నుంచే విశేష స్పందనను సొంతం చేసుకుంది. హౌస్‌ఫుల్ ప్రదర్శనలు, మళ్లీ మళ్లీ కుటుంబ ప్రేక్షకుల రాకతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఇది చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. సంక్రాంతికి తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అనేది అరుదైన ఘనతగా మారింది. అన్ని ప్రాంతాల్లోనూ సంచలన వసూళ్లతో భారీ విజయాన్ని సాధించింది.

ఈ సంచలనాత్మక ప్రదర్శనతో, నవీన్‌ పొలిశెట్టి తన నాలుగో వరుస బ్లాక్‌బస్టర్‌ను సాధించి, తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విశ్వసనీయ తారలలో ఒకరిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ప్రతి సినిమాతో తన మార్కెట్ ని పెంచుకుంటూ వచ్చి, ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో తన సినీ ప్రయాణంలోనే అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మరో మైలురాయిని నమోదు చేసింది. యూఎస్‌లో నవీన్‌ పొలిశెట్టి వరుసగా మూడు సినిమాలతో $1 మిలియన్‌కు పైగా వసూళ్లను సాధించిన ఘనతను అందుకున్నారు. ఇది కొద్దిమందికే దక్కిన అరుదైన విజయంగా నిలిచింది. అంతేకాదు, రోజువారీ కలెక్షన్లు బలంగా కొనసాగుతుండటంతో ‘అనగనగా ఒక రాజు’ ఇప్పుడు ప్రతిష్టాత్మక $2 మిలియన్ మార్క్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. పండుగ సమయంలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. అద్భుతమైన స్క్రీన్ హోల్డింగ్, వ్యూహాత్మక ప్లేస్‌మెంట్‌తో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ మోక్ష మూవీస్ ఈ చిత్ర భారీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ అసాధారణమైన బలం చూపిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది ‘అనగనగా ఒక రాజు’. భారీ సంక్రాంతి పోటీ ఉన్నా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కి చెందిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సినిమాకు అండగా నిలిచి, ఉత్తమ విడుదల అందించారు. కీలక ప్రాంతాల్లో తగినన్ని థియేటర్లను కేటాయించారు. సినిమాపై నమ్మకంతో ఈ స్థాయి విడుదల చేశారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ప్రేక్షకుల పెద్దఎత్తున థియేటర్లకు కదిలిరావడంతో, రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి.

కడుపుబ్బా నవ్వించే హాస్యం, కంటతడి పెట్టించే భావోద్వేగాలతో రూపొందిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం అన్ని వయసుల మరియు అన్ని ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అసలు సిసలైన సంక్రాంతి ఎంటర్టైనర్‌గా నిలిచింది. బలమైన రచనతో ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూసేలా అద్భుతంగా మలిచిన ఈ చిత్రానికి, దీర్ఘకాలం పాటు థియేటర్లలో ప్రదర్శితమయ్యే సత్తా ఉందని ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

ఐదు రోజుల్లో రూ.100.2 కోట్లు, నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్, యూఎస్‌లో హ్యాట్రిక్ మిలియన్ డాలర్, నాలుగు వరుస బ్లాక్‌బస్టర్లు.. ఇలా ‘అనగనగా ఒక రాజు’తో ఎన్నో ఘనతలు సాధించిన నవీన్ పొలిశెట్టి ప్రేక్షకుల హృదయాలలో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. ‘అనగనగా ఒక రాజు’ జోరు ఇప్పట్లో ఆగే సూచనలు లేవు. ఈ చిత్రం మరిన్ని మైలురాళ్లను చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది.

చిత్రం: అనగనగా ఒక రాజు
తారాగణం: నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి
సంగీతం: మిక్కీ జే మేయర్
దర్శకత్వం: మారి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణు గోపాల్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago