“రహస్య” ఈ నెల 9 న గ్రాండ్ రిలీజ్

Must Read

ఒక మంచం నుండి స్టార్ట్ అయిన మనం పుట్టుక చివరికి మన చావుతో ఒక మంచం పైనే ముగుస్తుంది. ఇలా ప్రతి మనిషి జీవితంలో మంచం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఒక మానవ జీవితంలో మనిషికి, మంచానికి ఉన్న రహస్య సంబంధం ఏమిటి ? అనే సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రమే “రహస్య”. SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి.S ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు ,గ్లిమ్స్ కు, పాటలకు, టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మీలో ఒకడు హీరో కుప్పిలి శ్రీనివాస్, హే బుజ్జి హీరో సతీష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర హీరో నివాస్ మాట్లాడుతూ… చాలా మందికి యాక్టింగ్ చేయాలనే డ్రీమ్ ఉన్నా సరే అది ఒక్కొక్క సారి జరగక పోవచ్చు. అయితే కెనడా లో ఉన్న నా దగ్గరకు ఈ కథ రావడం ఇందులో హీరోగా విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారికగా నటించడం చూస్తుంటే చాలా అదృష్టంగా బావిస్తున్నాను. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని, కథను దర్శకుడు అనుకున్నట్లే చాలా బాగా తీశాడు. డైరెక్షన్ టీం అంతా చాలా కష్టపడ్డారు. నిర్మాతలు ఈ సినిమా బాగా రావాలని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులోని సాంగ్స్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సునీల్ కశ్యప్ గారు తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మా సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పవచ్చు. చంద్ర కిరణ్, ఉద్దవ్ లు కూడా సినిమా బెస్ట్ రావడానికి చాలా హానెస్ట్ గా వర్క్ చేశారు. హీరోయిన్ సారా చాలా చక్కటి నటనను కనబరచింది..ఇలా ప్రతి ఒక్కరు కష్టపడి చేయడం వలనే సినిమా బాగా వచ్చింది. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటుడు కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక మంచానికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ నెల 9వ తేదీ వరకు వెయిట్ చేసి థియేటర్స్ లలో చూడండి. చూస్తున్న ప్రతి మనిషిని థ్రిల్ కు గురి చేసేలా దర్శకుడు చాలా బాగా తెరకెక్కించడమే కాకుండా నిర్మాతలకు భారం కాకుండా తీసిన ప్రతి షార్ట్ లోనూ వేస్టేజ్ లేకుండా తీశాడని తెలిసింది. చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ చేశాడు. హీరో నివాస్ ప్రతి ఫ్రెమ్ లో చాలా చక్కగా నటించాడు. నిర్మాతలు ప్రతి క్షణం ఈ సినిమా బాగా రావాలని తపనపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9 న వస్తున్న థ్రిల్లర్ మూవీ “రహస్య” చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర డైరెక్టర్ శివశ్రీ మీగడ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి దానికి ఒక రహస్యం ఉంటుంది. అలాగే మనం పుట్టుక దగ్గర నుంచి చనిపోయే వరకు మనకు మంచం ప్రధాన పాత్రపోసిస్తుంది. అయితే మనం వాడే ప్రతి మంచానికి మనిషికి ఉన్నటువంటి రహస్యమైన అభినవబావ సంబంధం ఏమిటీ అనే వేదాంత దొరణిలో రాసుకున్న కథే ఈ “రహస్య”. నేను స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకున్నా దాన్ని తెరపైకి తీసుకువచ్చే నిర్మాతలు ముందుకు రావాలి. అయితే నేను ఈ కథను నిర్మాతలకు చెప్పిన వెంటనే వారికి ఈ కథ కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. డి .ఓ. పి సెల్వ కుమార్ ప్రతి ఫ్రెమ్ ను పెయింటింగ్ లా చాలా చక్కగా తీశారు. డ్యాన్స్ మాస్టర్ చంద్ర కిరణ్ హీరో హీరోయిన్స్ తో చాలా బాగా డ్యాన్స్ చేయించాడు. ఇందులో NIA అధికారి పాత్రలో నటిస్తున్న నివాస్ ఈ చిత్రంలోని రహస్యాన్ని ఎలా చేదించాడు అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 9 న థియేటర్స్ లలో విడుదల అవుతున్న మా సినిమాను చూసి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ మాట్లాడుతూ.. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుంది. చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు, నటీ నటులు టెక్నిషియన్స్ అందరూ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. మాకు సినిమా ఫీల్డ్ కొత్త అయినా టీం అంతా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరిని సస్పెన్స్ కు గురి చేస్తుంది అన్నారు.

అతిధిగా వచ్చిన నటుడు సతీష్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని సాంగ్స్, ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. ఎడిటంగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఇందులో నటించిన వారంతా చాలా సెటిల్డ్ గా నటించారు. ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసే మంచి కంటెంట్ తో ఈ నెల 9 న వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.

డి. ఓ. పి. సెల్వ కుమార్ మాట్లాడుతూ.. మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు

ఎడిటర్ ఉద్దవ్ మాట్లాడుతూ… ఈ సినిమాలో ఒక్క షార్ట్ కూడా వేస్ట్ కాకుండా టీం అంతా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని అనుకున్న కథను అనుకున్నట్లే చాలా చక్కగా తీయడం జరిగింది. ఇందులో అంతా కొత్తవారైనా కథా బలం ఉన్న సినిమా కాబట్టి చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అన్నారు.

కోరియోగ్రాఫర్ చంద్ర కిరణ్ మాట్లాడుతూ.. ట్రైలర్ కు హ్జ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “రహస్య” సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

నటుడు వేద భాస్కర్ మాట్లాడుతూ.. ఇందులో నేను డి. జి. పి పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

లిరిసిస్ట్ సంజయ్ మహేష్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాకు లిరిక్స్ ఇచ్చే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

నటీ నటులు:
బుగతా సత్యనారాయణ, గెద్ద వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, సూరి బాబు, పాండు రంగారావు, ప్రదీప్, మోడల్ శ్రీను, రాజేశ్వరి, మధు, నల్ల శ్రీను, B.T. రావ్, T.V. రామన్, A.V. ప్రసాద్ తదితరులు

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ :SSS ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : గౌతమి.S
దర్శకత్వం ::శివ శ్రీ మీగడ
సంగీతం : :చరణ్ అర్జున్
బ్యాగ్రౌండ్ స్కోర్ : సునీల్ కశ్యప్
కెమెరామెన్‌ : జీ సెల్వ కుమార్
ఎడిటర్‌ : ఎస్ బి ఉద్దవ్
పి.ఆర్.ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News