భారతదేశం మూలాల్లో కథలు చెప్పడానికి చేతులు కలిపిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్

Must Read

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి ఈ ఏడాది ‘కాశ్మీర్ ఫైల్స్’ భారీ బ్లాక్బస్టర్ను అందించారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో  అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఇప్పుడు ఇంకొన్ని  గొప్ప కథలను చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. వినాయక చవితి శుభ సందర్భంగా.. ఈ విజయవంతమైన కాంబినేషన్ లో తదుపరి చిత్రాలను సమర్పించనున్న అభిషేక్ తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమక్షంలో, ఇరు నిర్మాణ సంస్థలు అగ్రిమెంట్ లు చేసుకున్నాయి.

వారి మునుపటి సినిమాలలానే బ్యానర్ లో వచ్చే తదుపరి సినిమాలు కూడా భారతదేశంలో మూలాల్లో, నిజమైన, నిజాయితీ, మానవత్వంకు సంబధించిన కథల ఆధారంగా ఉండబోతున్నాయి.

 “ఈ పండగ రోజున, మన అందమైన దేశంలోని ప్రజలకు మన మాతృభూమి గురించి కథలు చెప్పడానికి @i_ambuddha, @vivekagnihotri , #PallaviJoshiతో కలిసి మరో ఉత్తేజకరమైన ప్రయాణాన్ని ప్రారంభించాము. జై హింద్.” అని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తెలిపింది.

 “ఈ పండగ రోజున, @iambuddhafoundation & @AAArtsOfficial భారత్ లో మూలాల్లో  కథలను చెప్పడానికి,  భారతీయ పునరుజ్జీవనానికి దోహదపడేందుకు మరోసారి చేతులు కలిపాము. మిస్టర్ & మిసెస్ తేజ్ నారాయణ్ అగర్వాల్ @aaartsofficial @kaalisudheer @vivekagnihotri .” అంటూ పల్లవి జోషి పోస్ట్ చేశారు.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News