‘దాస్ కా ధమ్కీ’ నా పాన్ ఇండియా మూవీ : విశ్వక్ సేన్

Must Read

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ ఫలక్‌నుమా దాస్‌తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నారు. హీరోగా ప్రధాన పాత్రతో పాటు దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా తన స్వీయ దర్సకత్వంలో రాబోతున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. నివేదా పేతురాజ్ కథానాయిక.

దాస్ కా ధమ్కి రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్.  తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్ టైమెంట్ తో పాటు భారీ యాక్షన్‌ వుంటుంది. ఇందులో ఎంటర్ టైమెంట్ యాక్షన్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి. 95% చిత్రీకరణ పూర్తయింది, మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు చిత్రాలకు  స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరిస్తోంది. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది.

ఫుకెట్‌లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్‌ను, స్పెయిన్‌లో ఒక చిన్న షెడ్యూల్‌ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు. బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ను పర్యవేక్షించారు. చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా,  లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘దాస్ కా ధమ్కీ’  యూనిట్ చిత్ర విశేషాలని పంచుకుంది.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఫలక్‌నుమా దాస్‌ మా హోమ్ బ్యానర్ లో తీసిన మొదటి సినిమా. నేను ఎవరో కూడా తెలియని సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. మీడియాకి కృతజ్ఞతలు.  ‘దాస్ కా ధమ్కీ’  నా దర్సకత్వంలో వస్తున్న రెండో సినిమా. ఫలక్‌నుమా దాస్‌ కి దర్శకుడిగా పూర్తి క్రెడిట్ రాలేదనే భావిస్తా. ఎందుకంటె అది రీమేక్ సినిమా. దర్శకుడిగా నన్ను నేను సంపూర్ణంగా పరిచయం చేసుకుంటున్న సినిమా   ‘దాస్ కా ధమ్కీ’. నటిగా నాకు తృప్తిని ఇచ్చిన చిత్రమిది. ప్రసన్న అద్భుతమైన కథ ఇచ్చారు. హిలేరియస్ ఎంటర్ టైనర్. అదే సమయంలో థియేటర్లో చెమటలు కూడా పడతాయి. ఇందులో నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు. ఇండియన్ సినిమా ఇది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాం. బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో అద్భుతంగా యాక్షన్  డిజైన్ చేశారు.  తెలుగు సినిమాకి కొత్త అప్రోచ్ వచ్చింది.  క్లైమాక్స్ ఫైట్ హైలట్ గా వుంటుంది. వెంకట్ మాస్టర్ మరో వండర్ ఫుల్ స్టయిలీస్ ఫైట్ కంపోజ్ చేశారు. రామకృష్ణ గారు మరో కలర్ ఫుల్ యాక్షన్ ని డిజైన్ చేశారు. లియోన్ జేమ్స్ చక్కని మ్యూజిక్ ఇచ్చారు. సినిమా ఖచ్చితంగా  సినిమా న్యూ ఏజ్ వైబ్ ఇస్తుంది. థియేటర్ లో ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ నమ్మకంతోనే ఈ సినిమాని స్వయంగా దర్శక, నిర్మాణం చేపట్టాను. నా సినిమాలన్నిటికంటే ‘దాస్ కా ధమ్కీ’ పెద్ద సినిమా. దీపావళికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటిస్తాం” అని తెలిపారు.



కరాటే రాజు  మాట్లాడుతూ..  ‘దాస్ కా ధమ్కీ’ లో నవరసాలు వుంటాయి. భారీ బడ్జెట్ సినిమా ఇది. అద్భుతమైన కథ. ఎక్కడా రాజీ పడకుండా వున్నతమైన నిర్మాణ విలువలతో ఈ సినిమా తీస్తున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.” అన్నారు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News