‘సయారా’ కొత్త పాట ‘తుమ్ హో తో’ ప్రమోషన్‌లో మోహిత్ సూరి…

నా పాటలే విశాల్ మిశ్రాని సంగీత ప్రపంచంలో కెరీర్‌ కొనసాగించేలా ప్రేరేపించాయని తెలియడం ఆనందంగా ఉంది – ‘సయారా’ కొత్త పాట ‘తుమ్ హో తో’ ప్రమోషన్‌లో మోహిత్ సూరి

యష్ రాజ్ ఫిల్మ్స్, మోహిత్ సూరి కాంబోలో రూపొందుతున్న ‘సయారా’ బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్‌గా మారుతోంది. చార్ట్‌బస్టర్ సయారా టైటిల్ ట్రాక్ తర్వాత జుబిన్ నౌటియాల్ పాడిన ‘బర్బాద్’ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు మూడవ పాటను రిలీజ్ చేశారు. ఇండియన్ సెన్సేషనల్ సింగర్ విశాల్ మిశ్రా ఈ థర్డ్ సింగిల్ ‘తుమ్ హో తో’ని ఆలపించారు. ఈ పెప్పీ లవ్ ట్రాక్‌ను మేకర్స్ మంగళవారం (జూన్ 17) నాడు విడుదల చేశారు!



ఈ మూడో పాట రిలీజ్ సందర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ.. ‘12 సంవత్సరాల క్రితం విశాల్ నన్ను కలవడానికి వచ్చినప్పటి నుండి నేను, తను కలిసి ఓ ప్రత్యేకమైన సినిమా కోసం పనిచేయాలని అనుకున్నాము. మేము సరైన క్షణం కోసం వేచి చూస్తున్నాం. చివరకు అది సయారాతో నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా పాటలే అతన్ని సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చాయని, అవే స్పూర్తి నింపాయని విశాల్ చెప్పడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

మన పని ఎవరిపైన అయినా ఇలాంటి ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకున్నప్పుడు అదొక గొప్ప అనుభూతిని ఇస్తుంది. సంగీతానికి ప్రజల హృదయాలను తాకే సామర్థ్యం ఉందని, అది చాలా స్వచ్ఛమైన మాధ్యమమని నేను ఎప్పుడూ భావించాను. కాబట్టి నా 20 సంవత్సరాల దర్శకత్వం, సంగీత సృష్టిలో నా పాటల ద్వారా ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలను సృష్టించినందుకు నాకు నేనే కృతజ్ఞుడిగా భావిస్తుంటాను. నా కెరీర్‌లో నేను కలిసిన అత్యంత ప్రతిభావంతులైన కళాకారులలో విశాల్ మిశ్రా ఒకరు. సయారా మ్యూజిక్ ఆల్బమ్‌లో ఆయన పాట పాడటం నా అదృష్టం. 12 సంవత్సరాలుగా నన్ను కలుస్తూనే ఉన్నప్పటి నుండి విశాల్ నాకు ఇచ్చిన గీతాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ అద్భుతాలే.

విశాల్ గురించి, అతని టాలెంట్ గురించి, అతని ఎదుగుదల గురించి తెలుసుకోవడం నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. తుమ్ హో తో పాటతో మరోసారి అద్భుతాన్ని క్రియేట్ చేశారు. సయారా సినిమా నుండి మూడవ పాటతో అతని ప్రతిభను బయటపెట్టడానికి మేం ఎంతో ఎదురుచూశాం. అతని సంగీతాన్ని ఇష్టపడే వారు, అతని అత్యుత్తమ రొమాంటిక్ పాటను విని ఎంతో థ్రిల్ అవుతారు. విశాల్ సంగీతాన్ని ఇష్టపడే వారు తుమ్ హో తో పాటతో ప్రేమలో పడతారు’ అని అన్నారు.

‘సయారా’ టీజర్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కాలాతీత ప్రేమకథలను సృష్టించడంలో పేరుగాంచిన YRF, మోహిత్‌లు ఈ సారి మరోసారి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీని ఆడియెన్స్‌కు అందించబోతోన్నారు. సయ్యారా టైటిల్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. దీని అర్థం సంచరించే నక్షత్రం. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ, ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎవ్వరికీ అందదు. కేవలం వర్ణించడానికి ఉపయోగిస్తారు.

ఈ చిత్రం ద్వారా అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేస్తున్నారు. అనీత్ పద్దా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. సయారాను అక్షయ్ విధాని నిర్మించారు. జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

YRF గత 50 సంవత్సరాల సినీ చరిత్రలో భారతదేశానికి అన్ని కాలాలలోనూ కల్ట్ రొమాంటిక్ చిత్రాలను అందించింది. ప్రధానంగా యష్ చోప్రా, ఆదిత్య చోప్రా దర్శకత్వంలో ఎన్నో గొప్ప ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. మోహిత్ సూరి గతంలో ఆషికి 2, మలంగ్, ఏక్ విలన్ వంటి గొప్ప లవ్, రొమాంటిక్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Tfja Team

Recent Posts

త్వ‌ర‌లోనే నితిన్ 36వ సినిమా షూటింగ్ ప్రారంభం

నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న యూనిక్ సైఫై ఎంట‌ర్‌టైన‌ర్‌.. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో…

2 days ago

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల…

2 days ago

రికార్డులు తిరగరాస్తున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

కేవలం ఐదు రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ సాధించిన 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద విజయంయూఎస్‌లో హ్యాట్రిక్…

1 week ago

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్…

1 week ago

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 weeks ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 weeks ago