గ్రేట్ యాక్టర్ శివాజీకి తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డుని ప్రకటించింది. తాజాగా గద్దర్ అవార్డుల లిస్ట్‌ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ‘దండోరా’ చిత్రం పలు అవార్డుల్ని కైవసం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘దండోరా’ చిత్రం అవార్డుల్ని కొల్లగొట్టింది. శివాజీ కనబర్చిన అత్యుత్తమ నటనకు ఈ అవార్డు దక్కింది.
‘దండోరా’ చిత్రంలో శివాజీ పలు రకాల లేయర్స్, ఎమోషన్స్ ఉన్న పాత్రను ఎంతో గొప్పగా పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా శివాజీ పాత్రను తీర్చారు. ఇక కుల వ్యవస్థ గురించి శివాజీ చెప్పే డైలాగ్స్ కూడా ఆడియెన్స్‌ని ఆలోచింపజేశాయి. ‘దండోరా’లో శివాజీ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచిందని విమర్శకుల ప్రశంసలు, ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే.
శివాజీకి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా గద్దర్ అవార్డుని ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…