గద్దర్ అవార్డ్ 2025.. ‘దండోరా’లో అత్యుత్తమ నటనను కనబర్చి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా నిలిచిన శివాజీ

Must Read

గ్రేట్ యాక్టర్ శివాజీకి తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా అవార్డుని ప్రకటించింది. తాజాగా గద్దర్ అవార్డుల లిస్ట్‌ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ‘దండోరా’ చిత్రం పలు అవార్డుల్ని కైవసం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘దండోరా’ చిత్రం అవార్డుల్ని కొల్లగొట్టింది. శివాజీ కనబర్చిన అత్యుత్తమ నటనకు ఈ అవార్డు దక్కింది.

‘దండోరా’ చిత్రంలో శివాజీ పలు రకాల లేయర్స్, ఎమోషన్స్ ఉన్న పాత్రను ఎంతో గొప్పగా పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా శివాజీ పాత్రను తీర్చారు. ఇక కుల వ్యవస్థ గురించి శివాజీ చెప్పే డైలాగ్స్ కూడా ఆడియెన్స్‌ని ఆలోచింపజేశాయి. ‘దండోరా’లో శివాజీ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచిందని విమర్శకుల ప్రశంసలు, ఆడియెన్స్ నుంచి ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే.

శివాజీకి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా గద్దర్ అవార్డుని ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Latest News

‘ఇరుముడి’ కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ గారి సినిమాల్లో నా ఫేవరెట్ ఇరుముడి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన...

More News