“కుమారి 21ఎఫ్, ఈడో రకం – ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్” వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్ లో ఎన్నో ఉన్నప్పటికీ… తాజాగా నేను చేస్తున్న “మిరాకిల్” నా కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. థాంక్స్ టు డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల” అని అన్నారు క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్.
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “మిరాకిల్”లో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది.. సీనియర్ హీరోలు సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరో. “సత్య గ్యాంగ్, ఫైటర్ శివ” చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన “కొండమడుగు”లో పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు, యూనిట్ సభ్యులందరి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించింది “మిరాకిల్” చిత్రబృందం. తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా “మిరాకిల్” నిలిచిపోతుందని ప్రకటించడం ద్వారా ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది హీరోయిన్ హెబ్బా పటేల్.
కొండమడుగు గ్రామం నడిబొడ్డున గ్రామ ప్రజలతో కిక్కిరిసిన ఈ మీడియా సమావేశంలో… హీరో శ్రీరామ్, హీరోయిన్ హెబ్బా పటేల్, దర్శకుడు ప్రభాస్ నిమ్మల, చిత్ర కథానాయకుడు రణధీర్ బీసు, ఈ చిత్రంతో ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్న నరేష్ నాయుడు, సినిమాటోగ్రాఫర్ సురేందర్ రెడ్డి, సెకండ్ అండ్ థర్డ్ హీరోయిన్స్ నవ్యశ్రీ, అక్షర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్, ఈ చిత్రంలో ఫోరెన్సిక్ ఆఫీసర్ గా నటిస్తున్న సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీతోపాటు… కొండమడుగు గ్రామ పెద్దలు పాల్గొని మాట్లాడారు!!
సీనియర్ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ… “మిరాకిల్” వంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద హిట్ చేస్తారని, దర్శకుడిగా ప్రభాస్ నిమ్మలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరో రణధీర్, సెకండ్ అండ్ థర్డ్ హీరోయిన్లు నవ్యశ్రీ, అక్షర, విలన్ పాత్రధారి నరేష్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ… ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలా భావించి, అంకితభావం చూపుతుండడం నన్ను చాలా భావోద్వేగానికి లోనుచేస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీరామ్, సురేష్, హెబ్బా పటేల్ సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేను. హీరో రణధీర్, విలన్ నరేష్ నాయుడులకు ఈ చిత్రంతో చాలా మంచి పేరు వస్తుంది. ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్ పై రాని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా బాగా వస్తుండడానికి ముఖ్య కారకులు మా కెమెరామెన్ సురేందర్ రెడ్డి. అలాగే కొండమడుగు గ్రామ ప్రజల ప్రేమాభిమానాలు మా యూనిట్ ఎప్పటికీ మర్చిపోదు. ఈ గ్రామంలో కచ్చితంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తాం” అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… “ఈ మూడో షెడ్యూల్ తో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలో ప్లాన్ చేస్తాం. మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది” అని అన్నారు!!
ఆమని, నల్లా శ్రీధర్ రెడ్డి, యోగి కాత్రే, సాయిబాబా, దిల్ రమేష్, టేస్టీ తేజ, ఝాన్సీ, హర్షిత, మాస్టర్ షన్విత్, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, హైమావతి, సమీర్ దత్తా, బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్, బలగం రమేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వినయ్ కుమార్, కెమెరా: సురేందర్ రెడ్డి, ఎడిటింగ్: విశ్వనాధ్, మాటలు: జగతా శ్రీనివాస్, పాటలు: రాంబాబు గోసాల, ఫైట్స్: శ్రీను, నిర్మాతలు: రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల!!
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…