ZEE5లో జూన్ 27న ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’

ZEE5లో జూన్ 27న ప్రీమియర్ కానున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’

‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తరువాత ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనే ఓ ఉత్కంఠ రేపే వెబ్ సిరీస్‌తో మేకర్లు రాబోతోన్నారు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోంది. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన ఈ సిరీస్ జూన్ 27న ZEE5లో మాత్రమే ప్రీమియర్ కానుంది.

https://twitter.com/ZEE5Telugu/status/1934938717090959471

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌‌గా ZEE5 దూసుకుపోతోంది. గ్రామీణ వాతావరణం, ప్రకృతి సౌందర్యాల నడుమ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ను ప్రదర్శించడానికి ZEE5 సిద్ధంగా ఉంది. గ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఇన్వెస్టిగేషన్ అన్నీ కలిపి సీటు అంచున కూర్చునేలా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు.

1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఒక పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ వూతలూరు) ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.

ZEE5 తెలుగు బిజినెస్ హెడ్ – అనురాధ గూడూర్ మాట్లాడుతూ .. ‘ZEE5లో సాధారణ ప్రజలను ప్రతిబింబించే, వారికి కనెక్ట్ అయ్యే కథల్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనేది ఉత్కంఠను కలిగిస్తూనే సామాజిక సందేశాన్ని కూడా అందిస్తుంది. భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఈ సిరీస్ చూపిస్తుంది’ అని అన్నారు.

దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. ‘‘రెక్కీ’ తర్వాత, మరోసారి ZEE5తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. ఆ నమ్మకం భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలా దశాబ్ద కాలంగా వివాహాలను ఆపివేసిన గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ. అక్కడ ఒక స్త్రీ అందరూ భయపడే ప్రశ్న అడగడానికి ధైర్యం చేస్తుంది’ అని అన్నారు.

సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘‘రెక్కీ’ విజయం తర్వాత, ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ కోసం మరోసారి ZEE5తో చేతులు కలపడం చాలా బాగుంది. ఈ కథ నాకు మొదటి నుంచీ ప్రత్యేకంగా నిలిచింది. ఈ కథ విన్నప్పటి నుంచీ నన్ను వెంటాడుతూనే ఉంది. టెలివిజన్ కోసం కథలను సృష్టించడం, పాత్రలను పోషించడం కోసం సంవత్సరాలు గడిపిన వ్యక్తిగా ఈ ప్రాజెక్ట్ నాకు మరింత ఆవిష్కరించుకునేందుకు ఉపయోగపడింది. ఈ సిరీస్‌తో మేం నిర్మించిన ప్రపంచం గురించి ఎంతో గర్విస్తున్నాను. ప్రేక్షకులు మేం క్రియేట్ చేసిన ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

అభిజ్ఞ వూతలూరు మాట్లాడుతూ .. ‘ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా ఆనందంగా, సంతృప్తికరంగా ఉంది. ఈ పాత్రలో చాలా సున్నితత్వం, బలం ఉంటుంది. ముఖ్యంగా భయానికి అనుకూలంగా వాస్తవాలను తోసిపుచ్చే ప్రపంచంలో తిరిగి ప్రశ్నించే ఓ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తాను. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో కలిసి షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని అన్నారు.

మూఢనమ్మకాలతో ఓ శక్తివంతమైన సందేశంతో ఉత్కంఠ భరితమైన ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ రాబోతోంది. ఇది కేవలం సూపర్‌నేచురల్ థ్రిల్లర్ మాత్రమే కాదు భయం, సత్యం మధ్య జరిగే ఓ యుద్ధం. జూన్ 27 నుండి ZEE5లో మాత్రమే ప్రసారం అయ్యే ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ మిస్ అవ్వకండి.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

14 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago