‘సయారా’ కొత్త పాట ‘తుమ్ హో తో’ ప్రమోషన్‌లో మోహిత్ సూరి…

నా పాటలే విశాల్ మిశ్రాని సంగీత ప్రపంచంలో కెరీర్‌ కొనసాగించేలా ప్రేరేపించాయని తెలియడం ఆనందంగా ఉంది – ‘సయారా’ కొత్త పాట ‘తుమ్ హో తో’ ప్రమోషన్‌లో మోహిత్ సూరి

యష్ రాజ్ ఫిల్మ్స్, మోహిత్ సూరి కాంబోలో రూపొందుతున్న ‘సయారా’ బెస్ట్ మ్యూజికల్ ఆల్బమ్‌గా మారుతోంది. చార్ట్‌బస్టర్ సయారా టైటిల్ ట్రాక్ తర్వాత జుబిన్ నౌటియాల్ పాడిన ‘బర్బాద్’ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు మూడవ పాటను రిలీజ్ చేశారు. ఇండియన్ సెన్సేషనల్ సింగర్ విశాల్ మిశ్రా ఈ థర్డ్ సింగిల్ ‘తుమ్ హో తో’ని ఆలపించారు. ఈ పెప్పీ లవ్ ట్రాక్‌ను మేకర్స్ మంగళవారం (జూన్ 17) నాడు విడుదల చేశారు!



ఈ మూడో పాట రిలీజ్ సందర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ.. ‘12 సంవత్సరాల క్రితం విశాల్ నన్ను కలవడానికి వచ్చినప్పటి నుండి నేను, తను కలిసి ఓ ప్రత్యేకమైన సినిమా కోసం పనిచేయాలని అనుకున్నాము. మేము సరైన క్షణం కోసం వేచి చూస్తున్నాం. చివరకు అది సయారాతో నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా పాటలే అతన్ని సంగీత ప్రపంచంలోకి తీసుకు వచ్చాయని, అవే స్పూర్తి నింపాయని విశాల్ చెప్పడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

మన పని ఎవరిపైన అయినా ఇలాంటి ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకున్నప్పుడు అదొక గొప్ప అనుభూతిని ఇస్తుంది. సంగీతానికి ప్రజల హృదయాలను తాకే సామర్థ్యం ఉందని, అది చాలా స్వచ్ఛమైన మాధ్యమమని నేను ఎప్పుడూ భావించాను. కాబట్టి నా 20 సంవత్సరాల దర్శకత్వం, సంగీత సృష్టిలో నా పాటల ద్వారా ప్రజలకు ఎన్నో జ్ఞాపకాలను సృష్టించినందుకు నాకు నేనే కృతజ్ఞుడిగా భావిస్తుంటాను. నా కెరీర్‌లో నేను కలిసిన అత్యంత ప్రతిభావంతులైన కళాకారులలో విశాల్ మిశ్రా ఒకరు. సయారా మ్యూజిక్ ఆల్బమ్‌లో ఆయన పాట పాడటం నా అదృష్టం. 12 సంవత్సరాలుగా నన్ను కలుస్తూనే ఉన్నప్పటి నుండి విశాల్ నాకు ఇచ్చిన గీతాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ అద్భుతాలే.

విశాల్ గురించి, అతని టాలెంట్ గురించి, అతని ఎదుగుదల గురించి తెలుసుకోవడం నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. తుమ్ హో తో పాటతో మరోసారి అద్భుతాన్ని క్రియేట్ చేశారు. సయారా సినిమా నుండి మూడవ పాటతో అతని ప్రతిభను బయటపెట్టడానికి మేం ఎంతో ఎదురుచూశాం. అతని సంగీతాన్ని ఇష్టపడే వారు, అతని అత్యుత్తమ రొమాంటిక్ పాటను విని ఎంతో థ్రిల్ అవుతారు. విశాల్ సంగీతాన్ని ఇష్టపడే వారు తుమ్ హో తో పాటతో ప్రేమలో పడతారు’ అని అన్నారు.

‘సయారా’ టీజర్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కాలాతీత ప్రేమకథలను సృష్టించడంలో పేరుగాంచిన YRF, మోహిత్‌లు ఈ సారి మరోసారి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీని ఆడియెన్స్‌కు అందించబోతోన్నారు. సయ్యారా టైటిల్ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. దీని అర్థం సంచరించే నక్షత్రం. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ, ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎవ్వరికీ అందదు. కేవలం వర్ణించడానికి ఉపయోగిస్తారు.

ఈ చిత్రం ద్వారా అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేస్తున్నారు. అనీత్ పద్దా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. సయారాను అక్షయ్ విధాని నిర్మించారు. జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

YRF గత 50 సంవత్సరాల సినీ చరిత్రలో భారతదేశానికి అన్ని కాలాలలోనూ కల్ట్ రొమాంటిక్ చిత్రాలను అందించింది. ప్రధానంగా యష్ చోప్రా, ఆదిత్య చోప్రా దర్శకత్వంలో ఎన్నో గొప్ప ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. మోహిత్ సూరి గతంలో ఆషికి 2, మలంగ్, ఏక్ విలన్ వంటి గొప్ప లవ్, రొమాంటిక్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Tfja Team

Recent Posts

2027 సంక్రాంతి రిలీజ్ కు వస్తున్న డైరెక్టర్ పా.రంజిత్ భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ “వేట్టువం”

సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో…

20 hours ago

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,#RC17 # RC2Sukku ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్…

21 hours ago

నవీన్ చంద్ర ‘NC 51’ షూటింగ్ పూర్తి

నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి.…

3 days ago

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!

▪️ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి.. తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించిన డా. అనిల్ విశ్వనాథ్…

3 days ago

“సమ్మర్ హాలిడేస్” సినిమా ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది, ఈ దీపావళికి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి – ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు

నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "సమ్మర్ హాలిడేస్" కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్…

4 days ago

‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను – గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్

ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ…

4 days ago